Chinnaswamy Stadium: చిన్నస్వామి వేదికగా IPL రీ ఎంట్రీ.. బ్యాడ్ న్యూస్ ఏమిటంటే..

ఐపీఎల్ 2025 సీజన్‌ను సరిహద్దు వాతావరణం కొద్ది రోజుల పాటు నిలిపివేసింది. కానీ ఇప్పుడు మళ్లీ క్రికెట్ అభిమానులకు పండుగ సమయం వచ్చింది. ఈ రోజు నుంచి లీగ్ మళ్లీ ప్రారంభమవుతోంది. తొలిపోరులో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ – కేకేఆర్ జట్లు తలపడనున్నాయి. సాయంత్రం 7.30 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ వేడుకపై వర్షం నీళ్లు చల్లే ప్రమాదం కనిపిస్తోంది.

వాతావరణ శాఖ ఇప్పటికే బెంగళూరులో భారీ వర్షం సూచనలు జారీ చేసింది. మ్యాచ్‌ టైమ్‌లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశముందని అంచనాలు ఉన్నాయి. ఇది జరిగితే, లీగ్ రీస్టార్ట్ కు కాస్త నొప్పిగా మారవచ్చు. అయితే చిన్నస్వామి స్టేడియం అత్యుత్తమ డ్రైనేజీ వ్యవస్థ కలిగి ఉండటంతో, వర్షం తక్కువ సమయంలో ఆగిపోతే మ్యాచ్ జరగవచ్చన్న ఆశలు అభిమానుల్లో ఉన్నాయి.

ఇక ఫారమ్ పరంగా చూస్తే, ఆర్సీబీ ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో టాప్ 2లో నిలిచింది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌లలో 8 విజయాలు సాధించిన ఈ జట్టు, ఇవాళ్టి మ్యాచ్‌లో గెలిస్తే ప్లేఆఫ్స్‌కి చేరిన తొలి జట్టుగా నిలుస్తుంది. మళ్లీ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, మాక్స్‌వెల్ జంటలు మరోసారి చెలరేగితే అభిమానులకు నిజమైన ట్రీట్ దక్కనుంది.

అదే సమయంలో కేకేఆర్ మాత్రం మిక్సడ్ సీజన్‌ను ఎదుర్కొంది. ఇప్పటికే 12 మ్యాచ్‌లు ఆడి, కేవలం 5 విజయాలు మాత్రమే నమోదు చేయగలిగింది. ప్లేఆఫ్స్ ఆశలు దాదాపుగా గల్లంతైన నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో గెలుపు పెద్దగా ఉపయోగపడదు. అయినా అభిమానుల గౌరవం కోసం కేకేఆర్ పోరాడే అవకాశం ఉంది. మొత్తానికి, వర్షం అడ్డుకోకపోతే రాత్రి మనకు హై వోల్టేజ్ పోరు కచ్చితంగా దక్కనుంది.