Balakrishna: # NBK 107 పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ … ద్విపాత్రాభినయంలో బాలయ్య!

Balakrishna: బాలయ్య బాబు అఖండ సినిమా అభిమానులకు ఫుల్ జోష్ ఇచ్చారు.ఇక OTT లో అడుగు పెట్టి చరిత్ర తిరగరాశారు. ఆహా ఒరిజినల్స్ లో వచ్చిన అన్ స్టాపబుల్ తో టిఆర్పి లెక్క మార్చేశారు. సీజన్ 1 ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసి రెండో సీజన్ కోసం సిద్ధంవుతున్నారు. ఇక NBK @107ను మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయబోతున్నారు అనగానే ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా ఉన్నాయి. క్రాక్ సినిమా హిట్ తర్వాత గోపీచంద్ మలినేని తీయబోతున్న ఫిల్మ్ కావడంతో అంచనాలు పెరిగాయి.

ఇక ఈ సినిమా నుండి బాలయ్య బాబు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసాక రెస్పాన్స్ అదిరిపోయింది. ఇక ఇపుడు ఇంకో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమాలో బాలయ్యబాబు ద్విపాత్రభినయం చేయనున్నారని తెలుస్తోంది. తండ్రి కొడుకులు పాత్రలతో బాలయ్య బాబు మరోసారి అలరించనున్నారు. తండ్రి కొడుకుల మధ్యలో జరిగే సన్నివేశాలు హైలైట్ గా ఉండనున్నాయట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ మొదటి సారిగా బాలయ్య బాబుతో జత కట్టనున్నారు.

విలన్ గా కన్నడ హీరో దునియా ఫేమ్ విజయ్ తెలుగు లో పరిచయం అవుతున్నారు. ఒక కీలక పాత్ర కోసం వరలక్ష్మిని తీసుకున్నారని సమాచారం. ఇక సినిమా షూటింగ్ తెలంగాణ సిరిసిల్లలో భారీ యాక్షన్ ఫైట్ తో స్టార్ట్ చేసారు రామ్ లక్ష్మణ్ ఈ యాక్షన్ సన్నివేశాలను డైరెక్ట్ చేసారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. నవీన్ ఏర్నేని, రవి శంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ కాగా, బుర్ర సాయి మాధవ్ మాటలు అందిస్తున్నారు. ఇక రిషి పంజాబీ సినిమాటోగ్రాఫర్, మరియు నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.