ప్రభాస్ ‘సలార్’ ఇది నిజమేనా.?

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘సలార్’ సినిమా, సెప్టెంబర్ నెలాఖరున విడుదల కానున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకుడు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ సినిమాకి జరిగే అవకాశం వుందంటూ ప్రచారం షురూ అయిన సంగతి తెలిసిందే.

‘సలార్’ ప్రాజెక్టుని తొలుత ఒక్క పార్ట్‌గానే ప్లాన్ చేసినా, దాన్ని ఇప్పుడు రెండు పార్టులుగా విడదీయాల్సి వచ్చింది. ‘సలార్ సాగా’ అంటూ, రెండు పార్టుల విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ధృవీకరించింది. ఫస్ట్ పార్ట్ ‘సలార్ సీజ్‌ఫైర్’ సెప్టెంబర్‌లో విడుదలవుతుంది. ఆ తర్వాత, రెండో పార్ట్.. సమ్మర్ కోసం రెడీ చేస్తారట. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రెండో పార్ట్‌కి సంబంధించి కూడా షూటింగ్ చాలావరకు పూర్తయిపోయిందట.

సినిమా లెంగ్త్ అనుకున్నదానికంటే పెరగడంతోనే, ఇలా రెండు ముక్కలు చేశారట. సమ్మర్.. అని అంటున్నారుగానీ, ఇంకాస్త ఆలస్యం కావొచ్చునట రెండో పార్ట్. అది కూడా ‘సలార్’ ఫస్ట్ పార్ట్ సక్సెస్ మీద ఆధారపడి వుంటుందని అంటున్నారు.