సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఎవరం ఊహించలేం. ఒకప్పుడు స్టార్ స్టేటస్ అనుభవించిన వాళ్ళు దీనస్థితికి చేరిన సంఘటనలు చాలానే చూశాం. కెరీర్‌లో ఎంత వేగంగా పైకి ఎదిగారో అంతే వేగంగా కనుమరుగయ్యారు. తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం అయిన వేణు తొట్టెంపూడి కూడా అలాంటి సిట్యుయేషన్ ఎదుర్కొన్నాడు. మంచి టైమింగ్ తో ఎమోషన్, కామెడీ పండిస్తూ తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించిన వేణు స్వయంవరం చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత అనేక బ్లాస్ బస్టర్ చిత్రాలలో నటించి స్టార్ స్టేటస్ పొందాడు.
దాదాపు 26 సినిమాలలో నటించిన వేణుకి మంచి గుర్తింపు తెచ్చిన చిత్రాలలో స్వయం వరం, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్ , పెళ్ళాం ఊరెళితే , ఖుషి ఖుషీగా ఉన్నాయి. మిగతావి కూడా మంచి విజయం సాధించిన చిత్రాలే. 2006 తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్న వేణు 2012లో వచ్చిన దమ్ము సినిమాలో కీలక పాత్రలో మెరిసాడు.ఆ తర్వాత రామాచారి అనే సినిమా చేయగా అది పరాజయం పాలైంది. దీంతో ఆయన సినిమాలకు దూరంగా ఉంటూ వ్యాపారలపై దృష్టి పెట్టాడు
అనుపమ చౌదరి అనే యువతిని పెళ్లి చేసుకున్న వేణుకు ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం పలు వ్యాపారాలతో బిజీగా ఉన్న ఆయన 2019లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ప్రచారం చేశాడు. ఆయన బావ నామా నాగేశ్వరరావు ప్రస్తుతం టీఆర్ఎస్ తరపు ఖమ్మం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ కెమెరా కంటికి చిక్కాడు. అతని అభిమానులు తిరిగి సినిమాలలోకి రావాలని కోరుతున్నారు.