బాలకృష్ణ భార్య వసుంధర గురించి ఈ షాకింగ్ నిజాలు మీకు తెలుసా?

నట సింహం నందమూరి బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. బాలయ్య నటించిన సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా మాస్ ప్రేక్షకులు మెచ్చే సినిమాలలో నటిస్తూ బాలకృష్ణ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నారు. బాలయ్య సినిమాలకు దగ్గరగా ఉన్నా బాలకృష్ణ భార్య వసుంధర మాత్రం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే. బాలయ్య భార్య గురించి అభిమానులకు ఎక్కువగా తెలియదు.

బాలయ్య భార్య వసుంధర మధ్యతరగతి కుటుంబానికి చెందిన మహిళ కావడం గమనార్హం. వసుంధర బంధువుల అమ్మాయి కావడంతో తక్కువ మొత్తం కట్నానికే బాలయ్య పెళ్లి జరిగిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. వసుంధర తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహిళ కావడం గమనార్హం. బాలయ్య కూతుళ్లు సైతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే. బాలయ్య కూతుళ్లను సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంచారు.

సినిమాల ద్వారా బాలకృష్ణ కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించారని సమాచారం అందుతోంది. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే సంగతి తెలిసిందే. బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. సినిమాసినిమాకు బాలయ్య రేంజ్ పెరుగుతుండటం గమనార్హం.

తర్వాత ప్రాజెక్ట్ లతో బాలయ్య బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలకృష్ణ కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఒక్కో సినిమాకు 12 కోట్ల రూపాయల నుంచి 15 కోట్ల రూపాయల రేంజ్ లో బాలకృష్ణ పారితోషికం ఉండటం గమనార్హం.