ఎన్టీఆర్ కు హిట్లు ఇచ్చి బాలకృష్ణకు ఫ్లాపులు ఇచ్చిన స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

సీనియర్ ఎన్టీఆర్ రాఘవేంద్ర రావు కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలలో ఎక్కువ సినిమాలు ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని అప్పటి బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు భావించేవారని సమాచారం. ఈ కాంబినేషన్ లో మొత్తం 12 సినిమా తెరకెక్కి సంచలన విజయాలను సొంతం చేసుకోవడం గమనార్హం.

సీనియర్ ఎన్టీఆర్ కె.రాఘవేంద్ర రావు కాంబినేషన్ అడవిరాముడు సినిమాతో మొదలుకాగా ఈ కాంబినేషన్ లో వచ్చిన చివరి సినిమా మేజర్ చంద్రకాంత్ కావడం గమనార్హం. ఈతరం స్టార్ హీరోలలో కూడా చాలామంది స్టార్ హీరోలతో సినిమాలను తెరకెక్కించి రాఘవేంద్రరావు ఘన విజయాలను సొంతం చేసుకున్నారు. అయితే బాలకృష్ణ రాఘవేంద్రరావు కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా నిలవడం గమనార్హం.

అయితే ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాల సంఖ్య కూడా తక్కువేం కాదు. రౌడీ రాముడు కొంటె కృష్ణుడు ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి సినిమా కాగా ఈ కాంబినేషన్ లో పట్టాభిషేకం, అపూర్వ సహోదరులు, సాహస సామ్రాట్, దొంగరాముడు, అశ్వమేధం, పాండు రంగడు సినిమాలు తెరకెక్కగా ఈ సినిమాలన్నీ డిజాస్టర్లుగా నిలిచాయి. పాండు రంగడు తర్వాత ఈ కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు.

పాండు రంగడు సినిమాకు హిట్ టాక్ వచ్చినా కమర్షియల్ గా సక్సెస్ సాధించడంలో ఈ సినిమా ఫెయిలైంది. ప్రస్తుతం రాఘవేంద్ర రావు డైరెక్షన్ కు దూరంగా ఉంటున్నారనే సంగతి తెలిసిందే. అందువల్ల రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశం అయితే దాదాపుగా లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య ఇమేజ్ కు తగిన విధంగా సినిమాలను తెరకెక్కించే విషయంలో కె.రాఘవేంద్ర రావు ఫెయిలయ్యారు.