డిజాస్టర్ అవుతుందని తెలిసి బాలయ్య నటించిన సినిమా ఏదో తెలుసా?

సాధారణంగా స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు నటించే సినిమాలు కచ్చితంగా సక్సెస్ సాధించేలా జాగ్రత్తలు తీసుకుంటారనే సంగతి తెలిసిందే. సినిమా ఫ్లాప్ అవుతుందని ఏ మాత్రం అనుమానం ఉన్నా ఆ సినిమాలో నటించడానికి హీరోలు అస్సలు ఇష్టపడరు. అయితే నందమూరి నటసింహం బాలకృష్ణ మాత్రం ఫ్లాప్ అవుతుందని తెలిసినా ఒక సినిమాలో నటించడం గమనార్హం. తప్పనిసరి పరిస్థితుల్లో బాలయ్య ఈ విధంగా ఒక సినిమాలో నటించాల్సి వచ్చింది.

బాలయ్య కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలలో తిరగబడ్డ తెలుగుబిడ్డ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో నటించడం అటు బాలయ్యకు ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించడం కోదండరామిరెడ్డికి ఇష్టం లేదు. అయితే సీనియర్ ఎన్టీఆర్ కచ్చితంగా చేయాలని సూచించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బాలయ్య కోదండరామిరెడ్డి ఈ సినిమాను చేయాల్సి వచ్చిందని సమాచారం అందుతోంది.

ఈ సినిమాలో ఒక్క సినిమాలో ఒక్క సన్నివేశాన్ని మళ్లీ షూట్ చేద్దామని దర్శకుడు చెబితే ఫ్లాప్ అయ్యే సినిమాకు ఇంకో టేక్ ఎందుకు అని బాలయ్య అన్నారని సమాచారం. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా భానుప్రియ నటించారు. ఈ సినిమా నిర్మాతకు భారీ నష్టాలను మిగిల్చింది. సినిమా ఫ్లాప్ కావడంతో ఈ సినిమా వల్ల నిర్మాతలకు భారీస్థాయిలో నష్టాలు వచ్చాయని సమాచారం అందుతోంది.

తండ్రి సూచన మేరకు కథ నచ్చకపోయినా బాలకృష్ణ అయిష్టంగా ఈ సినిమాలో నటించడం గమనార్హం. బాలయ్య ప్రస్తుతం వరుస సక్సెస్ లను అందుకుంటున్నారు. బాలయ్య సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సక్సెస్ లో ఉన్న డైరెక్టర్లకు మాత్రమే బాలయ్య ఛాన్స్ ఇస్తుండటం గమనార్హం. బాలయ్యకు యూత్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.