Radhe Shyam : ఇన్సైడ్ టాక్ : “రాధే శ్యామ్” నుంచి మరో ఊహించని ట్రీట్ వస్తుందా..?

Radhe Shyam : ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రాల్లో ఆల్రెడీ షూట్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న భారీ పాన్ ఇండియా సిఎంమా “రాధే శ్యామ్” కూడా ఒకటి. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన ఈ సాలిడ్ విజువల్ ట్రీట్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే గత జనవరిలో ఆల్ మోస్ట్ రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం రిలీజ్ కి గాను కరోనా మూడో వేవ్ దెబ్బ కొట్టేసింది. దీనితో మళ్ళీ కొత్త రిలీజ్ డేట్ అవి ఇవి అని హంగామా నడిచింది. అప్పటికే ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యి సంచలనం రేపిన ఈ చిత్రం నుంచి ఇప్పుడు ఇంకో బిగ్గెస్ట్ ఊహించని ట్రీట్ ని చిత్ర బృందం రెడీ చేస్తున్నారట.

మరి ఆ ట్రీట్ ఏమిటంటే ఈ సినిమా నుంచి మరో ట్రైలర్ అంటే “రాధే శ్యామ్ ట్రైలర్ 2” ని రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న ఇంట్రెస్టింగ్ టాక్. అలాగే ఇదే రిలీజ్ చేస్తే మళ్ళీ ఈ సినిమాపై భారీ హైప్ నెలకొనడం గ్యారెంటీ అని చెప్పాలి.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా సత్యరాజ్, కృష్ణం రాజు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే యూవీ మేకర్స్ దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం వహించారు.