ఇన్సైడ్ టాక్ : SSMB28 కి ఈ క్లాస్ టైటిలే అట.!

టాలీవుడ్ ఎవర్ ఛార్మింగ్ మాస్ హీరో సూపర్ స్టార్  మహేష్ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తో అయితే చేస్తున్న హ్యాట్రిక్ సినిమా కోసం అందరికీ తెలిసిందే. గతంలో వీరి నుంచి రెండు క్లాసిక్ హిట్స్ “అతడు”, “ఖలేజా” ఉండేసరికి దీనిపై అనౌన్స్ చేసినప్పుడు భారీ అంచనాలు సెట్ అయ్యాయి.

అయితే మహేష్ కెరీర్ లో 28వ ప్రాజెక్ట్ గా చేస్తున్న ఈ సినిమా ఇపుడు ఎటెటో వెళ్తుంది కానీ ఈ సినిమా పై ఆసక్తి అయితే ఫ్యాన్స్ లో అంతగా కనిపించట్లేదు. మొదట భారీ ఏక్షన్ అన్నారు తర్వాత మాస్ ఫామిలీ ఎంటర్టైనర్ గా మార్చేశారు. ఇక దీనితోనే ఈ సినిమాకి కూడా త్రివిక్రమ్ తన రొటీన్ ఫార్మాట్ లోనే మరీ పలుచ టైటిల్ ని పెడుతున్నట్టుగా రూమర్స్ వచ్చాయి.

అయితే కొన్నాళ్ల కితం “అమరావతికి అటు ఇటు” అంటూ ఓ టైటిల్ బాగా హల్ చల్ చేసింది. కానీ తర్వాత అది ఫిక్స్ కాలేదని తెలిసింది. అయితే ఇపుడు ఇంట్రెస్టింగ్ గా మళ్ళీ ఇదే టైటిల్ ఇప్పుడు వినిపిస్తుంది. దీనితో ఈ క్లాస్ టైటిల్ నే ఫైనల్ గా ఫిక్స్ చేసినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఇక ఇది అయితే ఈ మే 31న అనౌన్స్ కానున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఇదే వస్తుందా లేదా అనేది వేచి చూడాలి. కాగా ఈ చిత్రంలో శ్రీ లీల, పూజా హెగ్డే లు హీరోయిన్స్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. హారికా హాసిని వారు నిర్మాణం వహిస్తున్నారు. మరి ఆల్రెడీ ఈ సినిమా తాలూకా స్ట్రీమింగ్ హక్కులు నెట్ ఫ్లిక్స్ వారు భారీ ధరకి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.