ఇన్సైడ్ టాక్ : రవితేజ సినిమా కూడా అవుట్? మేకర్స్ బిగ్ క్లారిటీ

టాలీవుడ్ సినిమా దగ్గర పండుగ సీజన్ వస్తుంది అంటే ఆ హవానే ఇంకో లెవెల్లో ఉంటుంది. మరి అందులో మెయిన్ గా సంక్రాంతి రేస్ అనేది చాలా పెద్దది ముఖ్యమైనది. ఆ రేస్ లో వచ్చిన సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది అంటే దానికి కాసుల వర్షమే.. అందుకే వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో పలు భారీ చిత్రాలే రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి.

మరి ఈ చిత్రాల్లో మహేష్ బాబు, నాగార్జున వెంకటేష్ సహా యంగ్ హీరో తేజ సజ్జ సినిమాలు ఉన్నాయి. అయితే వీటితో పాటుగా మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన “ఈగిల్” కూడా డేట్ లాక్ చేసుకుంది. అయితే ఈగిల్ తో పోటీగా విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం “ఫ్యామిలీ స్టార్” ని కూడా మేకర్స్ లాక్ చేశారు కానీ దానిని అనధికారికంగా సంక్రాంతి రేస్ నుంచి తప్పించారు.

దీనితో ఫైనల్ గా ఈగిల్ మేకర్స్ నే పంతం నెగ్గారు అనుకున్నారు. కానీ ఇపుడు సీన్ కాస్త మారుతున్నట్టుగా అనిపిస్తుంది. సంక్రాంతి రేస్ నుంచి ఈగిల్ సినిమా కూడా తప్పుకునే అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. పైగా ఈ రేస్ లో ఇన్ని సినిమాలు రావడం వారికే మంచిది కాదు అని ట్రేడ్ వర్గాల ప్రముఖులు కూడా సూచిస్తున్నారు.

దీనితో అలా వెనక్కి వెళ్లే చిత్రం ఏదన్నా ఉంది అంటే అది ఈగిల్ సినిమానే మాత్రమే అని అంటున్నారు. కానీ ఇదంతా సినిమాపై కావాలని చేస్తున్న నెగిటివ్ ప్రచారం అని సినిమా ఆన్ టైం రిలీజ్ అంటే సంక్రాంతికే వస్తుంది అని మేకర్స్ ఈ రూమర్స్ స్ప్రెడ్ అయ్యే లోపే అలర్ట్ అయ్యి బిగ్ అప్డేట్ ఇచ్చేసారు. సినిమా రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని కన్ఫర్మ్ చేస్తూ చైనా వీడియో బిట్ తో కన్ఫర్మ్ చేశారు. .