ఇండస్ట్రీ టాక్ : ప్రభాస్ “కల్కి” రిలీజ్ ఎప్పటికి అంటే..!

ప్రస్తుతం తెలుగు సినిమా దగ్గర నుంచి రానున్న పలు సెన్సేషనల్ చిత్రాల్లో అయితే పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సెన్సేషనల్ హాలీవుడ్ లెవెల్ భారీ చిత్రమే “కల్కి ఎడి2898”. కాగా ఈ భారీ చిత్రం రిలీజ్ నిజానికి వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా ఫిక్స్ చేయగా ఈ తర్వాత అయితే సినిమా పలు కారణాల చేత డేట్ మార్చుకోవాల్సి వచ్చింది.

అయితే ఇందుకు కారణం ప్రభాస్ సలార్ కూడా ఆలస్యం కావడం ఓ కారణం కాగా ఈ రెండు సినిమాలు కూడా వరుసగా వాయిదా పడ్డాయి. అయితే ఇక అసలు కల్కి సినిమా ఎప్పుడు రిలీజ్ అనేది సస్పెన్స్ గా మారగా ఇప్పుడు అయితే చిత్ర యూనిట్ సినిమాలో నటిస్తున్న బాలీవుడ్ సీనియర్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు కానుకగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని విడుదల చేశారు.

దీనితో అమితాబ్ పై టీజర్ లానే ఎక్కడా తన ముఖాన్ని రివీల్ చేయకుండానే చూపించారు. ఇక దీనితో పాటుగా పి ఆర్ కి ఇచ్చిన అప్డేట్ ప్రకారం అయితే మేకర్స్ ఈ సినిమాని వచ్చే ఏడాది ఈ ప్రథమార్థంలో రిలీజ్ చేస్తున్నట్టుగా ఫిక్స్ చేశారట. అంటే 2024 జూన్ లోపు ఏదొక సమయంలో కల్కి విడుదల ఉండనుంది.

అయితే ఆల్రెడీ ఆగష్టు వరకు ఒకో నెలలో ఒకో భారీ సినిమా ఆల్రెడీ సిద్ధంగా ఉంది. మరి కల్కి కి అయితే ఎక్కడ స్లాట్ దొరుకుతుందో చూడాలి. ఇంకా ఈ చిత్రంలో ఉలగనయగన్ కమల్ హాసన్ దీపికా పదుకొనె అలాగే దిశా పటాని లు నటించగా నాగ్ అశ్విన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.