ఇండస్ట్రీ టాక్ : “సలార్” అప్పటికి కంప్లీట్ అయ్యిపోతుందా?

ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లలో దర్శకుడు ప్రశాంత్ నీల్ హోం చేస్తున్న సెన్సేషనల్ మాస్ ప్రాజెక్ట్ “సలార్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రంని అయితే నీల్ ఏకంగా తన లాస్ట్ సెన్సేషనల్ పాన్ ఇండియా హిట్ కేజీఎఫ్ రెండు సినిమాల కన్నా డబుల్ లెవెల్లో తెరకెక్కిస్తున్నానని తెలిపాడు.

దీనితో ఈ యాక్షన్ ప్రాజెక్ట్ పై ఎనలేని హైప్ నెలకొనగా ఇప్పుడు ఈ సినిమాపై అయితే సినీ వర్గాల నుంచి ఇంట్రెస్టింగ్ టాక్ బయటకి వచ్చి వైరల్ గా మారింది. ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతూ ఉండగా సినిమా షూటింగ్ ని అయితే చిత్ర యూనిట్ వచ్చే ఏడాది వేసవి నాటికి కంప్లీట్ చేసేసారట. దీ

నితో అయితే అనుకున్న టైం కి రిలీజ్ అయ్యే ఛాన్స్ లు గట్టిగా ఉన్నట్టే అని చెప్పాలి. అలాగే దీనితో పాటుగా మరో సినిమా ప్రాజెక్ట్ కే కూడా ఆలోపే కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉందని మరో గాసిప్ కూడా వినిపిస్తుంది. మొత్తానికి అయితే దాదాపు ప్రభాస్ నుంచి వచ్చే ఏడాది రెండు సినిమాలు చూసే ఛాన్స్ ఉంది. ఇక సలార్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా రవి బాసృర్ సంగీతం అందిస్తున్నాడు.