టాలీవుడ్ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ చిత్రమే “సలార్”. దీనిపై ఉన్న అంచనాలు అయితే ప్రత్యేకంగా చెప్పలేదు. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఈపాటికే ఎన్నో రికార్డులు లేచిపోయి ఉండేవి కానీ మేకర్స్ సినిమాని డిసెంబర్ కి వాయిదా వేశారు.
ఇక ఫైనల్ గా ఇదే రోజులో షారుఖ్ నటించిన భారీ చిత్రం కూడా ఉండడంతో పోటీ రసవత్తరంగా మారింది. కాగా సలార్ విషయంలో ఇప్పుడు ఓ షాకింగ్ అప్డేట్ ఐతే తెలుస్తుంది. ఈ సినిమా ఇంకా షూటింగ్ చేస్తున్నారట. ఇది వరకు కొన్ని సీన్స్ రీషూట్ చేయగా ఇప్పుడు కొన్ని ఫ్రెష్ సీన్స్ ని కొత్తగా చేస్తున్నారట.
అయితే ఇవేవీ ప్రభాస్ లేని సీన్స్ మాత్రమే అని కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఇపుడు ప్రభాస్ తన కాలి ఆపరేషన్ తో రెస్ట్ లో ఉన్న సంగతి తెలిసిందే. దీనితో తాను లేని కొన్ని కీలక సీన్స్ అయితే హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తన చిత్ర యూనిట్ తో చేస్తున్నట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి.
దీనితో అయితే సలార్ ఇంకా పూర్తవ్వలేదు అని చెప్పాలి. కాగా ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. అలాగే మొత్తం రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతుంది. అలాగే రెండో భాగాన్ని వచ్చే ఏడాది ప్రథమార్ధంలో విడుదల చేయనున్నారు.