ఇండస్ట్రీ టాక్ : “సలార్” ట్రైలర్ రిలీజ్ లో మార్పు..?

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ హైప్ తో ఉన్న చిత్రాల్లో ఈ ఏడాది నెక్స్ట్ బిగ్గెస్ట్ రిలీజ్ అయ్యిన “సలార్” చిత్రం కూడా ఒకటి. కాగా ఈ చిత్రంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ అయితే ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు.

మరి టీజర్ తో ఒక్కసారిగా ఎనలేని హైప్ ని తెచ్చుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఆ ట్రైలర్ రెస్పాన్స్ తోనే సినిమా ట్రైలర్ పై కూడా బిగ్ అప్డేట్ ఐ అందించేసారు. ఈ ట్రైలర్ ని అయితే ఈ ఆగస్ట్ చివరలో రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేయగా ఇప్పుడు అయితే కన్నడ సినీ వర్గాల నుంచి సలార్ ట్రైలర్ పై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది.

దీనితో ఈ సినిమా ట్రైలర్ కి మేకర్స్ రెండు డేట్స్ ని ప్రస్తుతానికి హోల్డ్ లో ఉంచారట. మొదటి డేట్ గా అయితే ఆగస్టు 30 కి డేట్ లాక్ చేయగా ఒకవేళ ఇది అవ్వకపోతే ఆగస్టు 7న అయితే రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట. దీనితో సలార్ అవైటెడ్ ట్రైలర్ ఈ ఆగస్ట్ లో మిస్ అయితే సెప్టెంబర్ మొదటి వారం లో ఉంటుంది అని చెప్పాలి.

కాగా ఈ చిత్రాన్ని కూడా రెండు లేదా మూడు భాగాలుగా ప్లాన్ చేస్తుండగా మొదటి భాగం సలార్ సీజ్ ఫైర్ ఈ సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషనల్ రిలీజ్ కాబోతుంది. మరి ఈ చిత్రానికి కేజీఎఫ్ యూనిట్ నే వర్క్ చేయగా హోంబలే ఫిలిమ్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.