ఇండస్ట్రీ టాక్ : కాస్త ముందే “ఆదిపురుష్” ట్రైలర్.?

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర పెద్ద ఎత్తున మారుమోగుతున్న సినిమా పేరు “ఆదిపురుష్”. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన ఈ మాసివ్ బడ్జెట్ చిత్రం కాగా దీనిని బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించాడు. ఇక రామాయణం ఆధారంగా ప్లాన్ చేసిన ఈ సినిమాకి సాలిడ్ పాజిటివ్ వాతావరణం నెలకొనగా.

ఓవర్సీస్ లో అదిరే రేంజ్ లో డిమాండ్ ఏర్పడగా ఇప్పుడు అయితే ఈ మాసివ్ ప్రాజెక్ట్ ట్రైలర్ కోసం సినీ వర్గాల్లో సోషల్ మీడియాలో  నడుస్తుంది. కాగా ఈ చిత్రం ట్రైలర్ ని ఈ మే 9న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్లాన్ చేసిన మేకర్స్ ఆ 8 న అయితే థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా బజ్ వచ్చింది.

అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఈ విషయంలో బిగ్ చేంజ్ వచ్చినట్టు తెలుస్తుంది. కాగా థియేటర్స్ సహా ఆన్ లైన్ లో కూడా ఒకే రోజు ఈ ట్రైలర్ వస్తుందట. మరి మొదటగా అయితే 9న సాయంత్రం 5 గంటల 31 నిమిషాలకి థియేటర్స్ లో గ్రాండ్ గా 3డి మరియు 2డి లలో ట్రైలర్ ని రిలీజ్ చేయగా..

నెక్స్ట్ అయితే యూట్యూబ్ లో అదే రోజు సాయంత్రం 7 గంటల 11 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా స్ట్రాంగ్ బజ్ అయితే వైరల్ గా మారింది. మరి ఇది ఎంతవరకు నిజం అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కాగా ఈ చిత్రంలో జానకి దేవిగా కృతి సనన్ నటించగా లంకేశునిగా సాయి అలీఖాన్ నటించాడు. అలాగే ఈ జూన్ 16న వరల్డ్ వైడ్ గా బిగ్గెస్ట్ రిలీజ్ గా ఆదిపురుష్ రాబోతుంది.