ఇండస్ట్రీ టాక్ : ఒక ఊహించని కాంబినేషన్ తో చిరు?

1119010-chiru

ఈ ఏడాది ఓ బిగ్గెస్ట్ హిట్టు అలానే ఓ బిగ్గెస్ట్ ఫట్టు ఇచ్చిన టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు పలు చిత్రాలు ఓకే చేసిన సంగతి తెలిసిందే. అయితే మెగాస్టార్ ఇప్పుడు చేస్తున్న రీమేక్ చిత్రాలు ఏమాత్రం వర్కౌట్ కాకపోతుండడంతో అంతా కూడా మెగాస్టార్ స్ట్రైట్ సినిమాలు కొత్త దర్శకులతో చేయాలనీ సలహాలు ఇస్తున్నారు.

అయితే ఇప్పుడు మెగాస్టార్ రెండు సినిమాలు ఆల్రెడీ కమిట్ అయ్యి ఉన్నారు కానీ ఓ క్రేజీ రూమర్ ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. మెగాస్టార్ అయితే మొట్ట మొదటిసారిగా టాలీవుడ్ లో తాను ఇప్పటి వరకు చేయని ఓ దర్శకునితో సినిమా ప్లాన్ చేస్తున్నారట. కాగా ఆ దర్శకుడు మరెవరో కూడా కాదు..

మాస్ మూలవిరాట్ దర్శకుడు బోయపాటి శ్రీను అంటూ టాక్ వైరల్ గా మారింది. బాలయ్య లాంటి హీరోకి బోయపాటి ఏ రేంజ్ మాస్ సినిమాలు ఇచ్చాడో తెలిసిందే. ఇప్పుడు మెగాస్టార్ కోసం అయితే తాను సిద్ధం అవుతున్నాడని సినీ వర్గాలు అంటున్నారు. అయితే చాలా మందికి ఈ న్యూస్ కాస్త ఎగ్జైట్మెంట్ అనిపించినప్పటికీ కొందరు అయితే ఆ క్రింజ్ సినిమాలు వద్దు బాసు అంటున్నారు.

ఆ ఓవర్ సీన్స్ అన్నీ బాలయ్య చేస్తే బాగుంటుంది కానీ మీకు బోయ వద్దు అని అంటున్నారు. అయితే ఇప్పుడు వైరల్ గా మారిన ఈ టాక్ ఏమీ అఫీషియల్ అయితే కాదు ఏమో ఇప్పటివరకు చిరు ఇంకా చేయని దర్శకులు కూడా ఉండొచ్చు కదా దీనితో ఆ రకంగా కూడా కొందరు ఆలోచిస్తున్నారు.