గత ఏడాది టాలీవుడ్ సినిమా నుంచి వచ్చిన భారీ హిట్స్ సహా ఘోరమైన వైఫల్యాలు మరే ఏడాదిలో కూడా రాలేదు అని చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురిపించిన సినిమాలు చాలా ఉంటే వాటిని మించి ట్రేడ్ లో కోలుకోలేని దెబ్బ కొట్టిన డిజాస్టర్స్ కూడా ఉన్నాయి.
అయితే ఈ చిత్రాల్లో మెగా డిజాస్టర్ అలానే మెగా ఫ్యాన్స్ లో ఓ పీడకల లాంటి చిత్రం “ఆచార్య” కూడా ఒకటి. మరి ఈ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించగా ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంది అనేది అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా దెబ్బతో తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ భారీ నష్టాలు చూడాల్సి వచ్చింది.
అయితే అక్కడ నుంచి ఈ చిత్రం విషయంలో చాలా రచ్చ నడవగా ఈ సినిమా బిజినెస్ పరంగా అయితే సెటిల్మెంట్స్ ని దర్శకుడు కొరటాల శివనే చూసుకుంటున్నారని టాక్ ఉంది. అయితే ఇప్పుడు టాలీవుడ్ లేటెస్ట్ ఇన్ఫో ప్రకారం రీసెంట్ గానే మొత్తానికి ఆచార్య వివాదాన్ని కొరటాల ముగించినట్టుగా తెలుస్తుంది.
తాను అలాగే నిర్మాత నిరంజన్ రెడ్డి తో కలిసి ఆచార్య మూలాన నష్టపోయిన ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ కి అయితే సెటిల్ చేసేసారు అని వారి నష్టాలు క్లియర్ చేసినట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇది వరకే ఈ సినిమా విషయంలో రామ్ చరణ్ అలాగే చిరంజీవిలు కూడా తమ రెమ్యునరేషన్ లు వెనక్కి ఇచ్చేసిన సంగతి తెలిసిందే.