ఇండస్ట్రీ టాక్ : “సలార్” నుంచి మరో బిగ్ ట్రీట్ గెట్ రెడీ.. 

ఈ ఏడాదికి ఎండింగ్ గా అయితే డిసెంబర్ నెల స్టార్టింగ్ లోనే పలు క్రేజీ చిత్రాలు స్టార్ట్ అయ్యిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ మొదటి తేదీ లోనే హీరో రణబీర్ కపూర్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో తెరకెక్కించిన చిత్రం “ఆనిమల్” తో స్టార్ట్ కాగా ఈ చిత్రం అనంతరం డిసెంబర్ లో మరిన్ని చిత్రాలు అయితే ఉన్నాయి.

ఇక ఈ చిత్రాల్లో మరో బిగ్గెస్ట్ రిలీజ్ వచ్చే “సలార్” పై కూడా సెన్సేషనల్ హైప్ నెలకొంది. ప్రభాస్ మరియు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కించిన ఈ భారీ సినిమా ట్రైలర్ కూడా మొన్ననే వచ్చింది. అయితే ఇప్పుడు సినీ వర్గాల్లో ఈ సినిమా విషయంలో మరో క్రేజీ న్యూస్ అయితే వైరల్ గా వినిపిస్తుంది.

దీని ప్రకారం చిత్ర బృందం మరో ట్రైలర్ ని కూడా సిద్ధం చేస్తున్నారట. కాగా ఈ ట్రైలర్ ని ఈ డిసెంబర్ 16న రిలీజ్ చేసే సన్నాహాలు చేస్తున్నారు అని మొదటి ట్రైలర్ సినిమా కథని పాత్రలని పరిచయం చేస్తే ఈసారి వచ్చే ట్రైలర్ ఎవరు ఊహించని విధంగా క్రేజీ ఏక్షన్ కట్స్ తో ఉండబోతుంది అని తెలుస్తుంది.

అలాగే ప్రభాస్ పై కూడా ఎక్కువ స్క్రీన్ టైం లో కనిపిస్తుంది అని అంటున్నారు. మొత్తానికి అయితే ఈ డిసెంబర్ 16న మాత్రం ఒక యుద్ధమే రాబోతుంది అని చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా శ్రేయ రెడ్డి, పృథ్వీ రాజ్ సుకుమారన్ జగపతి బాబు తదితరులు పవర్ ఫుల్ పాత్రల్లో నటించారు. అలాగే ఈ సినిమా ఈ డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.