యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ లలో దర్శకుడు మారుతీ తో ప్లాన్ చేసిన సినిమా కూడా ఒకటి. అయితే ఈ చిత్రాన్ని ప్రభాస్ ఒక క్వికీ గా ప్లాన్ చేసుకోగా ఇప్పుడు ఇది మరింత భారీ సినిమాగా మారుతున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.
ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ కూడా నెమ్మదిగా స్టార్ట్ అయిపోగా భారీ సెట్టింగ్స్ నడుమ ఈ షూటింగ్ జరుగుతుంది. ఇక ఈ చిత్రాన్ని అయితే మారుతీ ఓ హారర్ అండ్ కామెడీ డ్రామాగా ప్లాన్ చేస్తుండగా హీరోయిన్స్ గా కూడా పలువురు యంగ్ అండ్ హాట్ బ్యూటీ లను లాక్ చేశారు.
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో విలన్ పాత్ర కూడా ఉందట. మరి దీని కోసం ఏకంగా అధీరా.. బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ని మారుతీ అండ్ టీం అప్రోచ్ అయ్యినట్టుగా తెలుస్తుంది. మరి దీనితో అయితే సంజయ్ దత్ కూడా సినిమాకి ఓకే చెప్పినట్టే సినీ వర్గాల్లో ఇప్పుడు గాసిప్స్ వినిపిస్తున్నాయి.
అయితే దీనిపై మరి ఇంకా అధికారిక క్లారిటీ బయటకి రావాల్సి ఉంది. ఇంకా ఈ సినిమాలో అయితే మాళవిక మోహనన్, శ్రీలీల మరియు రాశీ ఖన్నా లు హీరోయిన్స్ గా నటించనుండగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ బడ్జెట్ తో అయితే ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.