ఇండస్ట్రీ బజ్ : “దేవర” ఫస్ట్ గ్లింప్స్ కి డేట్.. 

తెలుగు సినిమా నుంచి వచ్చే ఏడాదిలో వచ్చే పలు అవైటెడ్ చిత్రాల్లో ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ సెన్సేషనల్ గా మారిన హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో చేస్తున్న రెండో సినిమా “దేవర” కూడా ఒకటి. మరి ఇది ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా నటిస్తుండగా ఈ సినిమా రిలీజ్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు.

అయితే గత కొన్ని వారాలు నుంచి చిత్ర బృందం ఈ జనవరిలోనే దేవర తాలూకా ఇంట్రో గ్లింప్స్ ని మేకర్స్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. కాగా మేకర్స్ ఈ గ్లింప్స్ ని మొదటిగా జనవరి 1న కొత్త సంవత్సరం కానుకగా రిలీజ్ చేస్తారని రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ డేట్ మార్చినట్టుగా తెలుస్తుంది.

ప్రస్తుతం ఆ వీడియో తాలూకా గ్రాఫిక్స్ పనుల్లో ఫుల్ బిజీగా ఉండగా వాటిని కంప్లీట్ చేసి ఈ జనవరి 8న అయితే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా వినిపిస్తుంది. మరి దీనిపై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి అయితే దేవర ప్రపంచం లోకి తీసుకెళ్లేందుకు మేకర్స్ ఇప్పుడు సర్వత్రా ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలి.

ఇక ఈ భారీ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు అలాగే అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ & యువసుధ ఆర్ట్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది ఉగాది కానుకగా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.