Jabardasth: జబర్దస్త్ కార్యక్రమంలో రోజా స్థానాన్ని భర్తీ చేసిన ఇంద్రజ..?

Jabardasth: జబర్దస్త్ కార్యక్రమం పది సంవత్సరాల నుంచి బుల్లితెరపై ప్రసారం అవుతూ ప్రేక్షకులను తనదైన శైలిలో సందడి చేస్తోంది. ఈ కార్యక్రమం ప్రసారం అయినప్పటి నుంచి ఏమాత్రం రేటింగ్స్ తగ్గకుండా ప్రతివారం రెండు రోజులపాటు బుల్లితెర ప్రేక్షకులకు కావల్సినంత వినోదాన్ని అందిస్తుంది. ఇకపోతే ఈ కార్యక్రమానికి మొదటి నుంచి రోజా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ జబర్దస్త్ కార్యక్రమానికి కీలకంగా మారారు. ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం రోజా అనారోగ్య కారణంగా కొద్ది రోజులపాటు ఈ కార్యక్రమాన్ని నుంచి తప్పుకున్నారు. ఈ సమయంలో రోజా స్థానాన్ని ఇంద్రజ భర్తీ చేశారు.

ఇంద్రజ ఈ కార్యక్రమంలో పాల్గొని అద్భుతమైన జడ్జిమెంట్ ఇవ్వడమే కాకుండా నవ్వులు చిందిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఒకానొక సమయంలో ఎంతో మంది అభిమానులు రోజా బదులు ఇంద్రజ జడ్జిగా కొనసాగడం మంచిది అని వారి అభిప్రాయాలను తెలియజేశారు. అయితే అనారోగ్యం నుంచి కోలుకున్న రోజా తిరిగి ఈ కార్యక్రమానికి రావడంతో ఇంద్రజ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.అయితే ప్రస్తుతం రోజా కు మంత్రి పదవి రావడంతో ఈమె ఈ కార్యక్రమం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

ఇదే సమయంలో జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా రోజా స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అనే విషయం గురించి అభిమానులలో పెద్ద సందేహం నెలకొంది. రోజా జబర్దస్త్ కార్యక్రమానికి రెండు వారాలు పూర్తి అయినప్పటికీ ఇంకా రోజ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ ఎపిసోడ్ రోజా మంత్రి కాకముందు షూటింగ్ చేసినవని మనకు తెలుస్తోంది. తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో రోజా స్థానంలో ఇంద్రజ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఇకపై జబర్దస్త్ కార్యక్రమంలో రోజా స్థానంలో ఇంద్రజ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.