ఇంద్రజతో కూడా ఆడిస్తున్నారుగా.. ఇదేక్కడి డ్యాన్స్ బాబోయ్!

Indraja: సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు వెండితెరపై అగ్రతారగా కొనసాగిన ఎంతోమంది నటీమణులు ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి తిరిగి బుల్లి తెర పై పలు టీవీ కార్యక్రమాలు, సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇలా ఇప్పటికే రోజా, కౌసల్య, ఇంద్రజ, ఆమని వంటి హీరోయిన్లు బుల్లి తెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇక ఈ మధ్య కాలంలో ఇంద్రజ కేవలం జడ్జిగా వ్యవహరించగా తాజాగా ఈమె బుల్లితెర కార్యక్రమాలలో అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే శ్రీదేవి డ్రామా కంపెనీకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నటువంటి ఇంద్రజ ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమంలో కూడా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నట్టుతెలుస్తోంది.జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న రోజాకు మంత్రి పదవి రావడం చేత ఈమె జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు ఇక రోజా స్థానాన్ని ఇంద్రజ భర్తీ చేశారు. ఇలా ఒక వైపు శ్రీదేవి డ్రామా కంపెనీ మరోవైపు జబర్దస్త్ కార్యక్రమాలతో రోజా బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా ఈమె ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతు ఉంటె అనే పాటకు డాన్స్ వేశారు. ఇలా చివరికి ఇంద్రజతో మల్లెమాల వారు బీభత్సంగా డాన్సులు చేయిస్తూ వారి కార్యక్రమాలకు రేటింగ్స్ తీసుకురావడం కోసం ఎంతో తాపత్రయ పడుతున్నారు. మొత్తానికి ఇంద్ర చేసిన ఈ డాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో అగ్రతారగా కొనసాగిన ఇంద్రజ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.