బాక్సాఫీస్ వద్ద ఇటీవల కాలంలో కొన్ని సినిమాలు అందుకుంటున్న ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. స్టార్ హీరో సినిమా అయినా సరే కంటెంట్ బాగోలేకపోతే కనీసం ఓపెనింగ్స్ కూడా నష్టాలను తగ్గడం లేదు. ఇక పెద్దగా స్టార్ ఇమేజ్ లేని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుంటున్నాయి.
ఇక ఎటు తిరిగి కంటెంట్ మాత్రం జనాలకు కనెక్ట్ అయితే ఎక్కడికో తీసుకు వెళుతున్నారు. 2023 ఈ ఇండిపెండెన్స్ డే వీకెండ్ మాత్రం ఇండియన్ సినిమాలకు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిసింది. విడుదలైన సినిమాలు భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకున్నాయి. ఇక అందులో కేవలం మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ మాత్రమే డిస్ట్రిబ్యూటర్స్ ను దారుణంగా దెబ్బ కొట్టింది.
ఇక ఈ ఇండిపెండెన్స్ డే 9 రోజుల వ్యవధిలోనే అయితే ఇండియన్ సినిమాలకు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 1000 కోట్లకు పైగానే కలెక్షన్స్ అయితే నమోదు అయ్యాయి. ఇక అందులో ఇప్పటికే 9 రోజుల్లో జైలర్ సినిమా అత్యధికంగా 449 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక బాలీవుడ్ మూవీ గదర్ 2 అయితే 396 కోట్ల గ్రాస్ వసూళ్ళను సొంతం చేసుకుంది.
ఇక ఓ మై గాడ్ 2 సినిమా కూడా ఎనిమిది రోజుల్లో 130 కోట్ల రేంజ్ లోనే 130 గ్రాస్ కలెక్షన్స్ రాబట్టుకుంది. మెగా స్టార్ భోళా శంకర్ సినిమా అతి తక్కువగా 8 రోజుల్లో 43 కోట్ల స్థాయిలో గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఈ విధంగా ఈ ఇండిపెండెన్స్ డే టైంలో అయితే మొత్తంగా తొమ్మిది రోజుల్లో ఈ నాలుగు సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా రూ.1,019 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం.