ఇండస్ట్రీలో మిల్క్ బ్యూటీగా, సూపర్ డాన్సర్ గా పేరు తెచ్చుకున్న నటి తమన్నా. ఈమె ఇండస్ట్రీకి వచ్చి 17 సంవత్సరాలు దాటుతున్నా ఇప్పటికీ అదే ఎనర్జీ అదే క్రేజ్ తో దూసుకుపోతుంది. ఒకవైపు సినిమాల్లోనూ, మరొకవైపు ఓటీటీ లోను, మరొకవైపు స్పెషల్ సాంగ్స్ చేస్తూ బిజీ బిజీగా ఉంది ఈ భామ.
ఈ 17 సంవత్సరాల లోని అనేక భాషలలోని ఆయా భాషల అగ్ర హీరోలతోని కలిసి నటించిన ఆమె ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్ పై దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. ఈమె ఏ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తే ఆ సినిమా హిట్ అవుతుందనే సెంటిమెంట్ పాతుకుపోయింది. అందుకు ఉదాహరణగా జైలర్, స్త్రీ 2, సినిమాలతో పాటు ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి. అయితే జైలర్ సినిమాలో నువ్వు కావాలయ్యా సాంగ్ ని కుర్రకారు ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలుసు.
ఆ పాట ట్రెండ్ సెట్టర్ గా నిలిచి సినిమా హిట్ అవ్వటానికి ప్రముఖ పాత్ర పోషించింది. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ సాంగ్లో రజనీకాంత్ ఒక సహాయ నటుడిగా కనిపిస్తాడు. ఆ తర్వాత ఆమె స్త్రీ 2 లో కూడా ఆజ్ కి రాత్ అనే ఐటెం సాంగ్ కి డాన్స్ వేసింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది అయితే డాన్సుల విషయంలో స్త్రీ 2 సాంగ్ చేసినప్పుడు చాలా తృప్తిగా అనిపించింది.
కానీ జైలర్ సినిమాలో చేసిన నువ్వు కావాలయ్యా సాంగ్ కి అన్యాయం చేశానేమో అనిపిస్తుంది ఆ సాంగ్ కి ఇంకా డాన్స్ బాగా చేయవచ్చు కానీ పూర్తిగా ఎఫర్ట్ పెట్టలేకపోయాను అనే బాధ ఇప్పటికీ ఉంది. ఇంకొంచెం కష్టపడితే ఆ సాంగ్ కి ఇంకా బాగా డాన్స్ చేయవచ్చు అనే ఫీలింగ్ కూడా తనకి కలుగుతుందని చెప్పింది తమన్నా. నార్మల్గా చేస్తేనే డాన్స్ అంత హిట్ అయింది అంటే పూర్తిగా ఎఫర్ట్ పెట్టి ఆ సాంగ్ లో డాన్స్ చేసి ఉంటే ఇంకా ఎంత బాగుండేదో అనుకుంటున్నారు మూవీ లవర్స్.