రష్మిక మందన్న ప్రస్తుతం ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు. సోలో సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ అమ్మడు స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇక సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించిన రష్మిక పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు ఏర్పరచుకుంది. ఈ సినిమా వల్ల బాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం రష్మిక తెలుగు తమిళ్ హిందీ కన్నడ వంటి భాషలలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది.
ఇదిలా ఉండగా.. హిందీలో వికాస్‌భల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గుడ్‌బై’ అనే సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో అమితాబచ్చన్ కూడా ప్రధాన పాత్రలో నటించాడు. కుటుంబ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రష్మిక ‘తారా భల్లా’ అనే పాత్రలో ప్రేక్షకుల ముందుకి రానుంది. అక్టోబర్ 7వ తేదీన సినిమా విడుదల కానుండటంతో సినిమా ప్రమోషన్లు ప్రారంభమయ్యాయి. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక ఈ సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
ఈ క్రమంలో రష్మిక మాట్లాడుతూ ఈ సినిమాలోని తారాభల్ల అనే పాత్ర తనకు చాలా ప్రత్యేకమైనదని చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగినా కూడా డబ్బింగ్ విషయంలో మాత్రం చాలా ఇబ్బంది పడినట్లు రష్మిక వెల్లడించింది. సాధారణంగా కర్ణాటక కి చెందిన రష్మిక కన్నడ కాకుండా ఏ ఇతర భాషలలో డబ్బింగ్ చెప్పాలన్న కొంచెం ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా హిందీలో డబ్బింగ్ చెప్పటానికి చాలా ఇబ్బంది పడినట్లు ఈ సందర్భంగా వెల్లడించింది. కానీ సరైన పద్ధతిలో ట్రైనింగ్ తీసుకోవడం వల్ల డబ్బింగ్ కూడా విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పకొచ్చింది.