అలాంటి సందర్భంలో మాట్లాడకుండా మౌనంగా ఉండటమే మంచిది: విజయ్ దేవరకొండ

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఉత్తరాది రాష్ట్రాలలో పర్యటిస్తూ పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఎవరు ఎలాంటి ప్రశ్నలు వేసిన వారికి సమాధానం చెప్పే వాడినని తెలిపారు. ఇలా అడిగిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పడం తప్పు అని తెలుసుకున్నాను. ఈ విధంగా మన గురించి ఒక ప్రశ్న అడిగేవాళ్లు మనపై ఒక అభిప్రాయం ఏర్పరచుకొనే మనల్ని ప్రశ్నిస్తారు. అలాంటి సమయంలో మనం ఏ విధమైనటువంటి సమాధానం చెప్పిన వాళ్లు వారి అభిప్రాయాన్ని మార్చుకోరు.సమాధానం చెప్పడం కన్నా మాట్లాడకుండా ఉండడమే మంచిది అంటూ ఈయన షాకింగ్ కామెంట్స్ చేశారు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే లైగర్ సినిమా ద్వారా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. ఇక ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ టీజర్ పాటలు పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలు పెంచాయి.మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఎంతో ఆత్రుతగా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.