Jabardasth: ప్రతి అమ్మాయి జీవితంలో అలాంటి వ్యక్తి ఉండాలి.. రీతూ షాకింగ్ కామెంట్స్!

Jabardasth: బుల్లితెర ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్య క్రమంలో భాగంగా ఎంతోమంది కమెడియన్స్ వివిధ రకాల స్కిట్ లను చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. అయితే గత కొన్ని వారాల నుంచి జబర్దస్త్ కార్యక్రమంలో హైపర్ ఆది సందడి చేయలేదు.ఈయన జబర్దస్త్ కార్యక్రమంలో కనిపించకపోవడానికి కారణాలు తెలియక పోయినప్పటికీ ఆది లేకపోవడంతో జబర్దస్త్ కార్యక్రమం రేటింగ్ కాస్త తగ్గిందనే చెప్పాలి. ఇలా హైపర్ ఆదిలేని జబర్దస్త్ మేము కూడా చూడలేదు అంటూ అభిమానులు తేల్చి చెప్పేస్తున్నారు.

ఇక హైపర్ఆది లేకపోవడంతో అజర్, రీతూ చౌదరి వంటి వారిని ఒక టీంగా తయారు చేశారు. అయితే గత గురువారం జరిగిన కార్యక్రమంలో భాగంగా రీతూ ఏకంగా ప్రొడక్షన్ టీ అమ్మాయిగా, స్వీపర్‌గా చూపించాడు. అయితే తాను టీ అమ్మాయిగా వేసిన గెటప్ అదిరిపోయింది అంటూ అజర్ తన పై కామెంట్ చేశారు. మొత్తానికి వీరిద్దరి స్కిట్ ఏదో అలా సాగుతూ వచ్చింది.

ఇకపోతే ఈ స్కిట్ అయిపోయిన తర్వాత రోజా మాట్లాడుతూ నిన్ను ఇలా టీ అమ్మాయిగా పిలుస్తూ ఉంటే నీకు కోపం రాలేదా అని ప్రశ్నించింది. ఈ మాటకు రీతు చౌదరి మాట్లాడుతూ నిజం చెప్పాలంటే అజర్ అంటే నాకు చాలా కోపం.. కానీ రెండు నెలల క్రితం ఇచ్చిన సపోర్ట్ కారణంగా ప్రస్తుతం నేను ఇక్కడ ఉన్నాను.ఇలాంటి వ్యక్తి ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉండాలి అంటూ అతని గురించి రీతూ చౌదరి షాకింగ్ కామెంట్ చేశారు.