Big Boss OTT Telugu: బుల్లితెరపై ఇప్పటికే ఐదు సీజన్ లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు ఓటీటీ వెర్షన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ ఫిబ్రవరి 26 నుంచి గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఇది మొత్తం 84 రోజుల పాటు సాగబోతుంది. ఇక వైభవంగా సాగిన ప్రారంభ ఎపిసోడ్‌లో 17 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎన్నో ఆశలతో ఎంట్రీ ఇచ్చారు. ఇక, దీన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటల పాటు స్ట్రీమింగ్ కూడా చేస్తున్నారు. అలాగే, హాట్‌స్టార్‌లో కొన్ని ఎపిసోడ్స్‌ను కూడా ఇస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ షోలో బూతులు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
గత సీజన్లో మాదిరి కాకుండా బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి కొత్త,పాత కంటెస్టెంట్లు కూడా ఎంట్రీ ఇవ్వడంతో. ఇక ఇందులో గత సీజన్లలో పాల్గొన్న వాళ్లను వారియర్స్ అని, కొత్త వాళ్లను చాలెంజర్స్ అని రెండు గ్రూపులుగా విభజించారు. వీళ్లకు పోటాపోటీగా టాస్కులు కూడా ఇస్తున్నారు. దీంతో ఈ రెండు గ్రూపుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు సాగుతోంది. ఇక ముందు ఐదు సీజన్ల బిగ్ బాస్ షో సెన్సార్‌తో నడిచేది కానీ ఇప్పుడు ఓటీటీ వెర్షన్ 24 గంటలూ ప్రసారం అవుతుంది కావున దీనికి ఎలాంటి కట్స్, బీప్స్ లేవు.
గతంలో ఎన్నడూ చూడని విధంగా బోల్డు టాస్కులు కూడా కనిపిస్తున్నాయి ఓటీటీ సీజన్ లో ఇక ఈ సీజన్ అందరి దృష్టినీ ఆకర్షించిందనే చెప్పవచ్చు. అయితే తాజాగా జరిగిన ఒక ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఒక టాస్క్ ను ఇచ్చారు అది నో ఫిల్టర్ టాస్క్ ఈ టాస్క్ లో భాగంగా అందరు గుండ్రంగా కూర్చుంటారు అందులో ఒకరు వీల్ తిప్పితే అందులోని బాణం ఎవరో ఒకరివైపు ఆగుతుంది. వాళ్లు బిగ్ బాస్ అడిగే ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. ఈ ప్రశ్నలను ముందుగా రీవిల్ చేయరు కంటెస్టెంట్లే ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఇక ఈ టాస్క్ లో భాగంగా అందరికీ చాలా బోల్డ్ గా ఉండే ప్రశ్నలు వచ్చాయి. ఇందులో యాంకర్ శివకు మీరు ఎప్పుడైనా పెళ్లైన మహిళతో డేట్ చేశారా’ అన్న ప్రశ్న ఎదురైంది. యాంకర్ రవి సమాధానమిస్తూ ‘అవును. నాకు అప్పట్లో ఒక ఆంటీతో ఎఫైర్ ఉండేది. నా మొదటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఆమెతోనే’ అంటూ బదులిచ్చాడు. తరువాత నటరాజ్ మాస్టర్‌కు కూడా ఒక బోల్డ్ ప్రశ్న వచ్చింది అది ‘మీకు పెళ్లికి ముందు ఎంత మందితో ఎఫైర్ ఉంది’ అన్న ప్రశ్న దీనికి సమాధానం ఇచ్చిన నట్రాజ్ మాస్టర్ అవును ‘దాదాపు 120 మందితో ఉండేది. వాళ్లందరూ నన్ను లవ్ చేశారు. అంటూ నోరుజారి నేను మాత్రం లవ్ చేయలేదు అంటూ కవర్ చేసుకున్నారు.ఇక ఈ మాట పై కొంతమంది పంచులు కూడా వేసారు.