సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలకు రావాలంటే అసహనం… విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్ వైరల్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ రచయితగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రచయిత విజయేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన మంచి రచయితగా రాజమౌళి తండ్రిగా అందరికీ సుపరిచితమే. ఇలా ఇండస్ట్రీలో రచయితగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన రాజ్యసభ సభ్యునిగా కూడా ఎంపికయ్యారు. ఇకపోతే తాజాగా ఈయన నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ నటించిన కార్తికేయ 2 సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్నారు.ఈ వేడుకలో భాగంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు.

ఈ క్రమంలోనే విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తనకు ఆడియో ఫంక్షన్లకు ట్రైలర్ లాంచ్ కార్యక్రమాలకు ఫ్రీ రిలీజ్ వేడుకలకు రావాలంటే ఎంతో అసహనం వేస్తుందని తెలిపారు.సినిమాలు ఫ్లాప్ అవుతాయని తెలిసినప్పటికీ ఇలాంటి వేడుకలకు హాజరయ్యి సినిమా అద్భుతంగా ఉందని మంచి విజయం అందుకోవాలని కోరుకోవడం చాలా మూర్ఖత్వం అంటూ ఈయన వెల్లడించారు. ఇకపోతే సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలకు అతిథిగా హాజరవడం గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఈయన కార్తికేయ 2 సినిమా గురించి కూడా మాట్లాడారు.

ఈ సినిమా ట్రైలర్ తాను చూసానని సినిమా ఎంతో అద్భుతంగా వచ్చిందని తెలిపారు.ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్స్ రాసి పెట్టుకోండి ఈ సినిమా పక్క హిట్ అవుతుందని విజయేంద్ర ప్రసాద్ భరోసా కల్పించారు. ఈ సినిమా తెలుగులో ఎంత వసూలు రాబడుతుందో హిందీలో కూడా అదే స్థాయిలో వసూలు రాబడుతుందని ఈయన తెలిపారు. అనుపమ ఎంతో అద్భుతంగా నటించారని విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఏది ఏమైనా సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకల గురించి ఈయన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.