వ్యాలెంటైన్స్ డే స్పెషల్.. వర్షకు ప్రపోజ్ చేసిన ఇమాన్యుయేల్

Immanuel Proposes Varsha In Jabardasth

ప్రేమికుల రోజు వస్తోందంటే బయట హడావిడి మామూలుగా ఉండదు. ప్రేమ జంటలు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అయితే బుల్లితెరకు ఈ ఘోరాలు పాకినట్టున్నాయి. వ్యాలెంటైన్స్ డే సందర్భంగా జబర్దస్త్ షోలో వర్ష ఇమాన్యుయేల్ రొమాన్స్ బాగానే క్లిక్ అయ్యేలా ఉంది. మామూలుగానే వర్ష ఇమాన్యుయేల్ ఓ రేంజ్‌లో హల్చల్ చేస్తుంటారు. ఈ ఇద్దరి ట్రాక్ ఇప్పుడు జబర్దస్త్‌లో ఫుల్ హాట్ టాపిక్ అయింది. బయట కూడా వర్ష ఇమాన్యుయేల్ జోడికి మంచి పాపులార్టీ వచ్చింది.

Immanuel Proposes Varsha In Jabardasth

అలా జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో వర్ష ఇమాన్యుయేల్ జోడికి బాగా క్రేజ్ రావడంతో వారిద్దరి మీదే సపరేట్ స్కిట్స్ చేస్తూ వచ్చారు. పండుగలకు వచ్చే స్పెషల్ ఈవెంట్లలోనూ ఈ ఇద్దరి మీదే స్పెషల్ ఫోకస్ పెట్టేస్తున్నారు. తాజాగా మరోసారి ఈ ఇద్దరిని సెంటరాఫ్ అట్రాక్షన్‌‌గా చేసేశారు. వచ్చే వారం ప్రసారం కానున్న జబర్దస్త్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో చివరగా వర్షకు ఇమాన్యుయేల్ ప్రపోజ్ చేశాడు.

వాలెంటైన్స్ డే అంటూ వర్ష ఇమాన్యుయేల్ మధ్య ట్రాక్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. నా కలర్ చూసి ఇంత వరకు నా పక్కన ఏ అమ్మాయి నిల్చోలేదు.. అంటూ ఇమాన్యుయేల్ చెప్పుకొచ్చాడు. కానీ వర్ష నీ మనసు చూశానని చెప్పింది కదా అంటూ రోజా పేర్కొంది. మీ అందరి ముందు ఆమెకు ప్రపోజ్ చేస్తానని రోజా పర్మిషన్ తీసుకుని మరీ.. ప్రపోజ్ చేశాడు. హ్యాపీ వ్యాలెంటైన్స్ డే అంటూ ప్రపోజ్ చేసేశాడు. దీంతో వర్ష తెగ సిగ్గుపడి పోయింది.