తాజాగా మరో మహిళ జయలలిత, శోభన్ బాబుల వారసురాలిని నేనే అంటూ రంగంలోకి దిగింది. ఆమె మధురై తాలూకా కార్యాలయంలో తనకు వారసత్వ దృవీకరణ పత్రం అందించాలని వాగ్వాదానికి దిగింది. మధురై తిరువళ్ళువర్ నగర్ కు చెందిన మీనాక్షి (38) అనే ఓ మహిళ తల్లిదండ్రులు వాళ్లే అని.. చెన్నై పోయెస్ గార్డెన్ లో ఉన్న తన తల్లి మృతి చెందడంతో వారసత్వ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంది.
దీంతో ఆ కార్యాలయం అధికారులు ఈ విషయం పట్ల ఆశ్చర్యపోయారు. ఇక దరఖాస్తు చేసుకొని నెల దాటడంతో తాను కార్యాలయానికి వచ్చి డిప్యూటీ తహసీల్దార్ ను సర్టిఫికెట్ ఇవ్వాలని కోరింది. ఇక వాళ్ళు చెన్నైలో తీసుకోమని అనడంతో.. తనను తన తల్లిదండ్రులు వదిలారని.. పళనిలో బంగారు రథం లాగే హక్కు తన తండ్రి తనకు ఇచ్చాడని ఆ సర్టిఫికెట్లు కూడా పొందానని.. కానీ వారసత్వ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వటం లేదని వాపోయింది. దీంతో ఆమె మీడియా ముందు కూడా కొన్ని విషయాలు బయట పెట్టింది.