గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె గత కొన్ని సంవత్సరాల క్రితం వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. అప్పట్లో ఈమెకు ఉన్న క్రేజ్ చూసి దర్శక నిర్మాతలే ఆశ్చర్యపోయారు.ఇదిలా ఉండగా ఈమె తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు పయనించింది అయితే అక్కడ అవకాశాలు వచ్చిన ఏ మాత్రం హిట్ లేకపోవడంతో తిరిగి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.ఇక్కడ కూడా అదే పరిస్థితి ఎదురవడంతో ప్రస్తుతం ఈమె తన దృష్టి మొత్తం తన శరీర ఫిట్నెస్ పై పెట్టింది.
ఈ క్రమంలోనే జిమ్ లో వర్కౌట్లు చేస్తూ తన శరీరం కోసం ఎంతో కష్టపడుతున్నారు ఇలియానా తాజాగా వర్కౌట్స్ తర్వాత తన ట్రైనర్ అన్న మాటలను గుర్తు చేసుకొని ఎంతో ఎమోషనల్ అవుతూ ఇన్స్టా ద్వారాఒక పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఇలియానా మాట్లాడుతూ.. వర్కౌట్ తర్వాత తన ట్రైనర్ తన దగ్గరకు వచ్చి ఇప్పుడు నీ చేతులను నీ దగ్గర పెట్టుకొని నీ శరీరం గురించి ఆలోచించు నీ కోసం నీ శరీరం ఎంత కష్టపడుతుందో తెలుస్తుంది అని చెప్పారు.
అది విన్న తర్వాత నిజమే కదా అనిపించింది. అలా చేసి నా బాడీ గురించి నేను ఆలోచించుకున్న తర్వాత నాకు ఎంతో సంతోషంగా అనిపించింది అని ఈ సందర్భంగా ఇలియానా ఎమోషనల్ అవుతూ ఆ విషయాన్ని సోషల్ మీడియా వెల్లడిస్తూ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంటూ అభిమానులకు తెలిపారు. ఇలియానా చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.