ఎరుపు రంగు బికినీలో రెచ్చిపోయిన ఇలియానా.. ఫోటోలు వైరల్!

దేవదాసు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమాతోనే విశేషమైన ప్రేక్షకాదరణ సంపాదించుకున్న ఈ బ్యూటీ కొంతకాలంపాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగారు. అప్పట్లో ఈమెకున్న క్రేజ్ చూసి దర్శక నిర్మాతలు షాక్ అయ్యారు. ఇలా కొంతకాలం పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈమె ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.

అయితే కొంతకాలం తర్వాత ఈమె సినిమాలు పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోవడంతో హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయి. తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ వైపు పై వెళ్లిన ఈ బ్యూటీకి అక్కడ అవకాశాలు వచ్చినప్పటికీ పెద్ద హిట్ సినిమాలు లేకపోవడంతో తిరిగి టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు కోసం ఎదురు చూస్తుంది.అయితే ఈమెకు తెలుగులో అవకాశాలు రాకపోవడంతో సోషల్ మీడియా వేదికగా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను షేర్ చేస్తూ విశేషమైన ప్రేక్షకాదరణ సంపాదించుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఇలియానా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసే ఫోటోలు ఎంతో మంది నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇకపోతే ఇలియానా ప్రస్తుతం మాల్దీవులకు వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇక మాల్దీవులలో ఈమె తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్ర కారులకు నిద్ర లేకుండా చేస్తుందని చెప్పవచ్చు.ఇకపోతే తాజాగా ఈమె ఎరుపు రంగు బికినీ ధరించినటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలో పై పలువురు నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.