ఇలియానా.. ఈసారి మరింత ఓపెన్!

ఒకప్పటి సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ ఇలియానా తెలుగులో ఎంత సక్సెస్ అయ్యిందో అందరికి తెలిసిందే. వరుస విజయాలతో ఈ బ్యూటీ దూసుకుపోయింది. స్టార్ హీరోలకి ఫస్ట్ ఛాయస్ గా మారిపోయింది. అయితే జులాయి మూవీ తర్వాత టాలీవుడ్ లో గుడ్ బై చెప్పేసి బాలీవుడ్ లో అడుగుపెట్టింది.

అయితే అక్కడి నుంచి ఆమె అడపాదడపా సినిమాలు చేస్తోన్న ఆశించిన స్థాయిలో స్టార్ హీరోయిన్ రేంజ్ సక్సెస్ అయితే రాలేదు. అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లాంటి స్టార్స్ తో కొన్ని సినిమాలలో నటించింది. ఇక కెరియర్ పరంగా ఆమెకి పెద్దగా గుర్తింపు తీసుకొచ్చిన మూవీస్ కూడా ఏపీ లేవు. మెల్లగా అవకాశాలు కూడా తగ్గుతూ వచ్చాయి.

తరువాత బాయ్ ఫ్రెండ్ కారణంగా సినిమాలకి దూరమై అతనితో ఫుల్ గా షికార్లు చేస్తూ ఎంజాయ్ చేసింది. అయితే సడెన్ గా మొదటి బాయ్ ఫ్రెండ్ బ్రేక్ అప్ చెప్పేసాడు. తరువాత కొంతకాలం డిప్రెషన్ లో ఉన్న ఈ బ్యూటీ మళ్ళీ రికవరీ అయ్యి సినిమాలు చేస్తూ వచ్చింది. అయితే గత కొంతకాలం నుంచి కత్రినా కైఫ్ బ్రదర్ తో డేట్ లో ఉందనే ప్రచారం నడుస్తోంది.

అయితే ఈ విషయాన్ని ఆమె ఎక్కడా రివీల్ చేయలేదు. అయితే సడెన్ గా తాను ప్రెగ్నెంట్ అని ఇన్ స్టాగ్రామ్ ద్వారా కన్ఫర్మ్ చేసింది. ఇక మాతృత్వాన్ని ఆమె ఎంతగా ఆశ్వాదిస్తుంది అనేది ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఎప్పటికప్పుడు పంచుకుంటుంది. తాజాగా ఇలియానా గర్భంతో ఉన్న ఫోటోని కూడా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి సర్ప్రైజ్ చేసింది.

బంప్ అలెర్ట్ అంటూ ఫోటోలని పంచుకుంది. అందులో బ్లాక్ డ్రెస్ లో క్యాజువల్ లుక్ లో ఉన్న ఇలియానా గర్భంతో కనిపిస్తూ ఉండటం విశేషం. అయితే ఇలియానాకి పుట్టబోయే బిడ్డకి తండ్రి ఎవరనేది ఇప్పుడు మిలియన్ డాలర్స్ ప్రశ్నగా ఉంది. ఆ విషయాన్ని అధికారికంగా ఆమె కన్ఫర్మ్ చేసేంత వరకు వెయిట్ చేయాల్సిందే.