ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన నాలుగో సినిమా పుష్ప 2. పుష్ప వన్ సినిమాతో తొలి పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న ఈ మూవీ టీం ఇప్పుడు పుష్ప టు కలెక్షన్స్ పరంగా రికార్డులు బద్దలు కొడుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో అల్లు అర్జున్ నట విశ్వరూపానికి, సుకుమార్ వరల్డ్ క్లాస్ టేకింగ్ కి వరల్డ్ వైడ్ గా సినీ లవర్స్ ఫిదా అయ్యారు. ముఖ్యంగా మన దేశంలోనే ఈ చిత్రం రికార్డుల పరంపర క్రియేట్ చేస్తుంది. తాజాగా ఈ సినిమా ఐదు రోజుల్లో 900 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాలో హైలైట్ అయిన మరొక విషయం ఏమిటంటే ఈ సినిమా ద్వారా పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి.
పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా.. పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అనే డైలాగ్ చెప్పినప్పుడు అతను వేసుకున్న బీర పువ్వు రంగు పోచంపల్లి ఇక్కత్ టీషర్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఫ్యాషన్ ప్రియులందరూ ఆ షర్ట్ గురించి ఎంక్వయిరీ చేయడం ప్రారంభించినప్పుడు అది పోచంపల్లి ఇక్కత్ సికో షర్ట్ అని తెలియటంతో ఇప్పుడు ఆ షర్టులకి డిమాండ్ విపరీతంగా పెరిగింది. పోచంపల్లి మార్కెట్లో అల్లు అర్జున్ ధరించిన ఇక్కత్ డిజైన్ చేనేత వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి
పుష్ప టీం కూడా ఆ సినిమా షూటింగు కోసం పోచంపల్లిలో మూడు రోజులపాటు షూటింగ్ నిర్వహించారట, ఆ సందర్భంగా చిత్ర యూనిట్ ఇక్కడ ఇక్కత్ వస్త్రాలు కొనుగోలు చేసినట్లు పోచంపల్లి వస్త్ర వ్యాపారులు చెప్పారు. తాము డిజైన్ చేసిన షర్ట్ అల్లు అర్జున్ ధరించడం పట్ల, ఆ విధంగా తమకి పబ్లిసిటీ రావటం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు అక్కడ వస్త్ర వ్యాపారులు. ఇప్పటికే పుష్ప షర్టులంటూ యూత్ వీటిని తెగ వాడుతుంది ఈ మానియో ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి.