శ్రీముఖి టీవిలో ఏం చూస్తుందో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం.. !

Srimukhi: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. బుల్లి తెరపై సందడి చేయకముందు శ్రీముఖి వెండితెరపై పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అనంతరం పటాస్ కార్యక్రమం ద్వారా యాంకర్ రవితో కలిసి శ్రీముఖి బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇలా బుల్లితెర రాములమ్మగా పేరు సంపాదించుకున్న శ్రీముఖి రోజురోజుకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు.

ఇదిలా ఉండగా శ్రీముఖి ప్రస్తుతం సరిగమప సింగిగ్ కాంపిటీషన్ కార్యక్రమానికి, అలాగే జాతిరత్నాలు అనే కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా వెండితెరపై పలు సినిమాల్లో నటిస్తూ కూడా బిజీగా ఉన్నారు. ఈ విధంగా వెండితెర బుల్లితెర పై ఎంతో బిజీగా గడుపుతున్న శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఇలా సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే శ్రీముఖి తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

సాధారణంగా చిన్నపిల్లలకు టీవీలో టామ్ అండ్ జెర్రీ, చోట బీమ్ వంటి కార్యక్రమాలు చూడటానికి ఇష్టపడతారు. అయితే శ్రీముఖి ఇంత వయసు వచ్చినప్పటికీ చిన్న పిల్లల మాదిరిగా టామ్ అండ్ జెర్రీ కార్యక్రమాలను చూస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తోంది.ఇలా ఈమె టామ్ అండ్ జెర్రీ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నటువంటి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడం తో ఎంతోమంది నెటిజన్లు ఈ ఫోటో పై స్పందిస్తూ ఇంత వయస్సు వచ్చినా ఇలాంటి కార్యక్రమాలు చూడటం ఏంటి బాబోయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదిఏమైనా శ్రీముఖిలో చిన్న పిల్లల మనస్తత్వం అలాగే ఉంది అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.