తెలుగు లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్స్ కోసం అంత ఖర్చా!!

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న లాల్ సింగ్ చడ్డా అనే సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషలలోనూ విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో అమీర్ ఖాన్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్ నటిస్తోంది. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ అండ్ హీరో అక్కినేని నాగచైతన్య ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని భాషలలో విడుదల కానుంది. అయితే ఈ సినిమాలో నాగచైతన్య కీలకపాత్రలో నటించడంతో ఈ సినిమాని తెలుగులో కూడా బాగా ప్రమోట్ చేస్తున్నారు.

ఈ సినిమా తెలుగులో చిరంజీవి సమర్పణలో విడుదల కానుంది. ఈ సినిమా కోసం చిరంజీవి భారీ స్థాయిలో పారితోషికం అందుకున్నట్లు సమాచారం. ఇక నాగచైతన్య ఈ సినిమాలో నటించడంతో తెలుగులో కూడా భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయటానికి కోట్ల రూపాయలలో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. లాల్ సింగ్ చడ్డా సినిమా ని టాలీవుడ్ లో ప్రమోట్ చేయడానికి దాదాపు 5 నుండి 6 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ సినిమా ప్రమోషన్స్ లో మెగాస్టార్ అక్కినేని నాగార్జున వంటి స్టార్ హీరోలు పాల్గొనడంతో ఈ స్థాయిలో ఖర్చు అయినట్లు సమాచారం.

భారీ అంచనాల మధ్య విడుదల కానున్న లాల్ సింగ్ చడ్డా సినిమాలో అక్కినేని నాగచైతన్య అమీర్ ఖాన్ మధ్య 30 నుండి 40 నిమిషాల పాటు సన్నివేశాలు ఉన్నాయని సమాచారం. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రమోషన్స్ చేసినప్పటికీ సినిమాలో స్ట్రాంగ్ కంటెంట్ లేకపోతే ప్రేక్షకులు సినిమాని అంగీకరించరని ఇప్పటికే ఎన్నో సినిమాల విషయంలో నిరూపణ అయింది. ఇటీవల విడుదలైన థాంక్యూ సినిమాతో ప్లాఫ్ అందుకున్న నాగచైతన్య ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి మరి. ఈ సినిమా విషయంలో అమీర్ ఖాన్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.