కృష్ణ పేరుపై ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

సూపర్ స్టార్ కృష్ణ సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తేనె మనసులు సినిమా ద్వారా హీరోగా అందరికీ పరిచయమయ్యారు.ఇలా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ అతి తక్కువ సమయంలోనే అగ్ర హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కృష్ణ ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు.ఇలా వరుస సినిమాలతో ఏమాత్రం విరామం లేకుండా ఏడాదికి పది నుంచి 17 సినిమాలను విడుదల చేసిన ఘనత కేవలం కృష్ణ గారికి మాత్రమే చెందుతుంది.

ఈ విధంగా ఇండస్ట్రీలో తన ఐదు దశాబ్దల సినీ ప్రస్థానంలో ఏకంగా 350 కి పైగా సినిమాలలో నటించిన ఘనత కృష్ణ గారికి మాత్రమే చెల్లుతుంది. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కృష్ణ భారీ ఆస్తులను కూడబెట్టినట్టు సమాచారం.ఈ క్రమంలోనే ఈయనకు తన స్వగ్రామమైన బుర్రేపాలంలో పాటు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలలో ఖరీదైన ప్రాంతాలలో భారీ ఆస్తులు ఉన్నట్టు సమాచారం.ఈ విధంగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే కృష్ణ సుమారు 300 కోట్లకు పైగా ఆస్తులను కూడా పెట్టినట్లు తెలుస్తోంది.

ఇలా కృష్ణ పేరుపై 300 కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు ఉన్నాయని అలాగే ఇంద్ర భవనం లాంటి ఇంటిలో ఈయన నివసించడమే కాకుండా ఈయన గ్యారేజీలో ఏకంగా 20 కోట్ల రూపాయల విలువ చేసే ఖరీదైన ఏడు కార్లు ఉన్నాయని తెలుస్తోంది.ఇకపోతే కృష్ణ గారి విలాసవంతమైన జీవితాన్ని తన కుమార్తె మంజుల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ తెలియజేసిన విషయం తెలిసిందే. ఆయన ఇల్లు కొన్ని ఎకరాలలో ఇంద్ర భవనాన్ని తలపిస్తుందని చెప్పాలి. ఇలాంటి విలాసవంతమైన ఇల్లు హైదరాబాద్ లోనే కాకుండా చెన్నైలో కూడా ఉన్నట్లు సమాచారం. మొత్తానికి కృష్ణ ఇండస్ట్రీలో కొనసాగుతూ భారీ స్థాయిలో ఆస్తులను కూడా పెట్టారు.