యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు కొన్ని సెన్సేషనల్ ప్రాజెక్ట్ లు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇంకా ఈ చిత్రాల్లో కొన్ని పాన్ ఇండియా స్థాయి నుంచి పాన్ వరల్డ్ లెవెల్లోనే తెరకెక్కిస్తుండగా ఈ లైనప్ లో ఓ సినిమా కోసం గత కొన్నాళ్ల నుంచి ఆడియెన్స్ సహా సినీ వర్గాల్లో కొన్ని గాసిప్స్ వినిపిస్తూ వస్తున్నాయి.
మరి ఆ సినిమానే దర్శకుడు మారుతీ తో ప్లాన్ చేసిన సినిమా. నిజానికి ఈ సినిమా చుట్టూ పెద్ద డైలమా నే నడుస్తుంది. ప్రభాస్ ఈ సినిమా నుంచి బయటకి వచేస్తున్నాడని కొన్ని ఊహాగానాలు వినిపిస్తుండగా ఈ సినిమాపై అయితే లేటెస్ట్ గా సరైన క్లారిటీ బయటకి వచ్చేసింది.
ఈ సినిమా ఆగిపోలేదట. అంతే కాకుండా ఈ సినిమాని చిత్ర యూనిట్ ఈ సెప్టెంబర్ లోనే లేదా అక్టోబర్ లో స్టార్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా ఫుల్ ఫ్లెడ్జ్ గా ఓకే అవ్వడానికి చిన్న ఇష్యూ ఉందట.
ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కోలీవుడ్ హాట్ బ్యూటీ మాళవిక మోహనన్ ఫిక్స్ కాగా ఇతర ఫీమేల్ లీడ్ ఇంకా ఫైనల్ అవ్వాల్సి ఉందట. దీనికి నిర్మాత మారుతికి వారం పది రోజులు టైం ఇచ్చారట. అందుకే ఈ చిత్రం ఫైనల్ గా సెట్టయ్యిపోయినట్టే అని చెప్పాలి.