Tollywood: అల్లు అర్జున్ ప్రమేయం లేకుండా జరిగినటువంటి ఘటనలో ఆయనని ప్రధాన నిందితుడిగా చేరుస్తూ అరెస్టు చేయడాన్ని ఏ ఒక్కరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాకుండా అభిమానులు సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కూడా ఈ విషయంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత చూపుతున్నారు. సినిమా విడుదల సమయంలో సెలబ్రిటీలు తప్పనిసరిగా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడటం సర్వసాధారణం అయితే అక్కడ జరిగిన తొక్కేసలాటలో అభిమాని చనిపోతే అందుకు హీరోని బాధ్యుని చేయడం నూటికి నూరు శాతం తప్పని పలువురు సెలబ్రిటీలు అల్లు అర్జున్ కి మద్దతు తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఈ విషయంలో అరెస్టు కావడం ఆయనని కోర్టుకు హాజరపరచడం కోర్టు తనకు 14 రోజులపాటు రిమాండ్ విధించడంతో సినిమా సెలబ్రిటీలు ఏకమయ్యారు. ఈ క్రమంలోనే ఒక్కొక్కరుగా సెలబ్రిటీలు అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరోలు సైతం అల్లు అర్జున్ కు మద్దతు తెలుపుతున్నారు. బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ స్పందిస్తూ ఈ ఘటనకు అల్లు అర్జున్ ని బాధ్యున్ని చేసి అరెస్టు చేయడం బాధాకరం అంటూ ఖండించారు.
ఇక నటుడు బ్రహ్మాజీ కూడా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఇలా తొక్కిసలాటలో భాగంగా చాలామంది చనిపోతుంటారు అలా చనిపోయిన ప్రతి చోట అరెస్టు చేయాలి అంటే ఇప్పటికే సగం మంది రాజకీయ నాయకులు జైల్లోనే ఉంటారు అంటూ ఈయన అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు. ఇక నటి పూనం సైతం అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండించారు. బహిరంగ ర్యాలీలు నిర్వహించిన వారు ఎంతమంది ఉన్నారన్నది చూడటానికి ట్రై చేస్తున్న అలాంటి ర్యాలీలు సభలలో ఎంతో మంది అమాయకులు చనిపోయారని ఈమె గుర్తు చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్టు చేయటానికి ఆమె ఖండించారు. వంశాన్ని చూసుకొని కాకుండా సొంతంగా ఎదిగిన స్టార్ అల్లు అర్జున్ అంటూ ఈమె అల్లు అర్జున్ కు మద్దతు తెలిపారు. ఇలా సెలబ్రిటీల నుంచి అల్లు అర్జున్ కు పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తుంది.