సుమ బుల్లితెరకు గుడ్ బై చెప్పనుందా?

యాంకర్ సుమ యాంకర్ గా రాకముందు ఆమె పలు సీరియల్స్ లో నటిస్తూ సందడి చేశారు. వెండితెరపై పలు సినిమాలలో కూడా సుమ సందడి చేశారు. చాలా మందికి ఈ విషయం తెలియదు.ప్రస్తుతం ఈమె బుల్లితెర యాంకర్ గా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. యాంకర్ గా సుమ ఎంతటి క్రేజ్ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. ఒక హీరోయిన్ రేంజ్ పాపులారిటీ సుమకు కూడా ఉందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం వ్యక్తం చేయాల్సిన పనిలేదు.ఇలా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న సుమ వెండితెరపై జయమ్మ పంచాయతీ అనే సినిమా ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.

ఈ క్రమంలోని ఈమె నటించిన జయమ్మ పంచాయతీ సినిమా మే 6వ తేది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించారు. ఈ సినిమా పక్కా హిట్టవుతుందని ఇప్పటికే ఈ సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.సుమ జయమ్మ పంచాయతీ కనుక అభిమానుల అంచనాలను చేరుకొని సినిమా హిట్ అయితే ఈమెకు సినిమా అవకాశాలు వస్తాయి అనడంలో ఏమాత్రం సందేహపడాల్సిన పనిలేదు. ఈ విధంగా సుమ వరుస సినిమాలతో బిజీ అయితే కనుక బుల్లితెర కార్యక్రమాలకు దూరమవుతారనే వార్తలు వినపడుతున్నాయి.

సుమ సినిమాలలో బిజీ అయితే కనుక గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రసారం ఉన్నటువంటి క్యాష్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పనున్నారు.కేవలం క్యాష్ మాత్రమే కాకుండా బుల్లితెరపై ప్రసారమవుతున్న మరి కొన్ని కార్యక్రమాలకు కూడా సుమ రాకపోవచ్చనే వార్తలు వినపడుతున్నాయి. అయితే తన గురించి ఈ విధంగా వస్తున్న వార్తలపై సుమ స్పందిస్తూ ఈ వార్తలను కొట్టిపారేశారు.తనకు ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన బుల్లితెర కార్యక్రమాలను తన వదులుకునే ప్రసక్తే లేదని సుమ తెలియజేశారు. మరి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న సుమ వెండితెరపై ఏ విధంగా ప్రేక్షకులను సందడి చేస్తుందో తెలియాల్సి ఉంది.