అలా అయితే హీరోగా నాకు ఎవరు అవకాశాలు ఇవ్వరు.. జూనియర్ ఎన్టీఆర్!

దివంగత నటుడు నందమూరి తారకరామారావు వారసులుగా ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఇలా నందమూరి కుటుంబం నుండి ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలలో ఒకడిగా గుర్తింపు పొందాడు. ఇంతకాలం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటించి పాన్ ఇండియా హీరోగా దేశమంతటా పాపులర్ అయ్యాడు. ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుతుంది. దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలో ఈ సినిమా విడుదలైన అన్ని భాషలలోనూ ఎన్టీఆర్ ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.

 

ఇదిలా ఉండగా గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ బాడీ షేమింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం స్లిమ్ గా ఎంతో హండ్సం గా ఉండే జూనియర్ ఎన్టీఆర్ గతంలో చాలా లావుగా ఉండేవాడినని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. గతంలో ఫుడ్ అంటే తనకెంతో ఇష్టమని తన ఆహారపు అలవాట్లు అన్ని తన తాత దగ్గరనుండి నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు. హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత కూడా ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా కూడా దీనిమీద ధ్యాస తగ్గలేదని , తనకి ఇష్టమైన ఆహారాన్ని కడుపునిండా తినే వాడినని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండ నలుగురు తినే బావర్చి బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఫుడ్ ని తాను ఒక్కడినే తినేవాన్ని అంటూ చెప్పుకొచ్చాడు.

 

నేను బరువు తగ్గటానికి ఎంతమంది ఎన్ని చెప్పినా వినని ఎన్టీఆర్ కానీ రాఖి సినిమాలో మొదటిసారిగా తనని తాను స్క్రీన్ పై చూసుకొని అంత లావుగా ఉన్నందుకు చాలా సిగ్గుగా అనిపించిందని చెప్పుకొచ్చాడు. ఆ సినిమా తర్వాత ఎలాగైనా సన్నబడాలన్న ఉద్దేశంతో ఫుడ్ తినటం కంట్రోల్ చేసుకొని చాలా కష్టపడి వర్క్ అవుట్ లు చేసి సన్నబడ్డానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు కూడా మునుపటిలా తాను ఫుడ్ తినగలనని…కానీ మళ్లీ లావైపోతే నన్ను ఎవరు హీరోగా ఆదరించరు అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఇప్పుడున్న హీరోలు చాలా స్లిమ్ గా హ్యాండ్సమ్ గా ఉన్నారు. ఇక ఈ టైంలో మళ్లీ తాను లావు అయితే తనఅభిమానులు ఒప్పుకోరు.. అంటూ వెల్లడించాడు.