చిత్తూరు నాగయ్య అంటే ఈ తరం వారికి అవగాహన లేకపోవచ్చు. బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఆడుతున్న సమయంలో చిత్తూరు నాగయ్య అంటే తెలియని వారంటూ ఉండరు. ఇండస్ట్రీలో దర్శకుడిగా సంగీత దర్శకుడిగా నటుడిగా గుర్తింపు పొందిన నాగయ్య కి ఆ రోజుల్లో దర్శకులు నిర్మాతలు బ్రహ్మరథం పట్టేవారు. పిల్లలు లేని నాగయ్య ఎన్టీఆర్, నాగేశ్వరరావు లను తన కన్న కొడుకులుగా చూసుకునేవారు. నాగయ్య గారి మీద ఉన్న అభిమానంతో ఎన్టీఆర్, నాగేశ్వరరావు కూడా నాన్నగారు అంటూ ఆయన చుట్టూ తిరిగేవారు. దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి ఎంతో గుర్తింపు పొందిన నాగయ్య మరణించిన తర్వాత ఆయన దహన సంస్కారాలు చేయటానికి రూపాయి కూడా లేకపోవడంతో ఎన్టీఆర్ తన సొంత ఖర్చుతో స్వయంగా దహన సంస్కారాలు నిర్వహించినట్లు సమాచారం.
అత్యంత తక్కువ ఖర్చుతో సినిమాలు తీయడంలో నాగయ్య గారు చాలా ప్రసిద్ధి. ఎంత తక్కువ ఖర్చుతో సినిమా తీసిన కూడా అంత ఎక్కువ లాభం వచ్చేది. ఆ కాలంలో నాగయ్య హీరోగా చేసిన వేమన సినిమా విడుదలైనప్పుడు ఆయన అభిమానుల్ని అదుపు చేయటానికి పోలీసులు లాఠీచార్జి చేయవలసి వచ్చింది అంటే ఆయనకి ఉన్న పాపులారిటీ ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇండస్ట్రీలో దర్శకుడిగా రాణించిన నాగయ్య హీరోల కన్నా ఎక్కువ రమ్యునరేషన్ తీసుకునేవాడు. ఇలా రెండు చేతుల సంపాదించి నాగయ్యకి ఒక చెడు అలవాటు ఉంది. మార్కెట్లోకి కొత్త మోడల్ కారు వచ్చిందంటే చాలు ఎంత ఖరీదైన సరే ఆ కార్లను కొనుగోలు చేసేవాడు.
అంతేకాకుండా నాగయ్యకి సొంత రాష్ట్రం మీద ఉన్న అభిమానం వల్ల ఆంధ్రప్రదేశ్ నుంచి సినిమా అవకాశాల కోసం మద్రాసు కు ఎవరు వెళ్లినా సరే ఆయనే స్వయంగా వారిని కలిసి తమ ఇంట్లో ఆతిథ్యం ఇచ్చేవాడు. తన ఇంటికి వచ్చిన వారికి లేదనకుండా ఏదో ఒకటి చేతిలో పెట్టి పంపించేవారు. ఇలా తాను సంపాదించిన డబ్బు మొత్తం ఇలా దానధర్మాలకు రచించేవాడు. నాగయ్య శ్రేయస్సు కొరకు ఎన్టీఆర్ పలుమార్లు ఇలా దానధర్మాలు చేయవద్దని వారించినా కూడా.. నేను సంపాదించినది కాదు ఆ పైవాడు ఇచ్చినది అంటూ శృతి మెత్తగా సమాధానం చెప్పేవాడు. ఇలా దానధర్మాలు చేయటంతో ఆఖరకు ఆయన చనిపోయిన తర్వాత దహన సంస్కారాలకు డబ్బు లేకపోవడంతో ఎన్టీఆర్ స్వయంగా తన డబ్బుతో నాగయ్య అంతిమయాత్ర జరిపించినట్లు సమాచారం.