మహేష్ సినిమా హిట్ అయితే ఆయన స్టార్ హీరో కాలేడు.. మహేష్ సినిమా విషయంలో కృష్ణ జడ్జిమెంట్?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో సినిమాలలో అద్భుతమైన పాత్రలలో నటించి తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకోవచ్చారు.ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలలో నటించి జేమ్స్ బాండ్ కౌబాయ్ వంటి చిత్రాలను తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత కృష్ణ గారికి మాత్రమే చెందిందని చెప్పాలి. ఈ విధంగా కృష్ణ ఐదు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్న ఈయన నేడు ఉదయం తుది శ్వాస విడిచారు.ఈ క్రమంలోనే ఎంతో మంది సెలబ్రిటీలు ఆయన నివాసానికి చేరుకొని పెద్ద ఎత్తున ఆయన మృతికి నివాళులు అర్పిస్తున్నారు.

ఇకపోతే కృష్ణ స్టార్ హీరో అయినప్పటికీ తన కుమారుడిని బాల నటుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేసినప్పటికీ ఆయన మాత్రం మహేష్ బాబు సినిమాల ఎంపిక విషయంలో ఏమాత్రం జోక్యం చేసుకునేవారు కాదని తెలుస్తోంది.తనకు ఏ సినిమా సూట్ అవుతుంది ఏది లేదు అనే విషయాన్ని స్వయంగా తానే తెలుసుకోవాలని అందుకే తన కష్టాన్ని తానే భరించాలన్న ఉద్దేశంతో కృష్ణ ఏ విధమైనటువంటి సహాయం చేసేవారు కాదని ఓ సందర్భంలో వెల్లడించారు.

ఇకపోతే మహేష్ బాబు సినిమాలన్నింటినీ ముందుగా చూసే కృష్ణ తన సినిమాల పట్ల తన అభిప్రాయాన్ని తెలియజేసే వారట అయితే మురారి సినిమా విడుదలకు ముందు రివ్యూ చూసినటువంటి కృష్ణ మహేష్ బాబు భుజాలపై చేయి వేసి తనని అభినందించారని తెలియజేశారు. ఆరోజు కృష్ణ కళ్ళల్లో ఎంతో ఆనందం కనబడిందని మహేష్ బాబు వెల్లడించారు. ఇకపోతే నాని సినిమా రివ్యూ చూసినటువంటి కృష్ణ గారు ఆ సినిమాకి కూడా తన అభిప్రాయాన్ని తెలియజేశారని వెల్లడించారు.

మహేష్ బాబు సినీ కెరియర్ లో నాని సినిమా ప్రయోగాత్మక చిత్రం అయితే ఈ సినిమా రివ్యూ చూసిన తర్వాత సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమా కనుక హిట్ అయితే మహేష్ బాబు తన జీవితంలో సూపర్ స్టార్ కాలేడని నాని సినిమా పై తన అభిప్రాయాన్ని తెలియజేశారని మహేష్ ఓ సందర్భంలో తెలియజేశారు.ఈ క్రమంలోనే మహేష్ బాబు నాని సినిమా విషయంలో కృష్ణ గారి జడ్జిమెంట్ అక్షరాల నిజమైందని ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచిన సంగతి మనకు కూడా తెలిసిందే. ఈ విధంగా నాని సినిమా విషయంలో కృష్ణ గారి జడ్జిమెంట్ నిజమైందని వెల్లడించారు.