Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ గారిని తాను ఏ రోజుకైనా సీఎంగా చూడాలనేది తన కల అని ప్రముఖ సినీ ఆర్టిస్ట్ టార్జాన్ తెలిపారు. అనుకోవడమే కాదు ఎన్టీఆర్ అన్న కచ్చితంగా సీఎం అవుతాడు అని ఆయన బల్ల గుద్ది చెప్పారు. ఎన్టీఆర్ ఇప్పటికీ తన తాతా గారు తెలుగుదేశం పార్టీ పెట్టారని గుర్తు చేసుకుంటారని ఆయన అన్నారు. ఎన్టీఆర్ ఇక్కడే పుట్టాడు. కానీ ఆయన ఎక్కడున్నా సింహమేనని, తెలంగాణా, ఆంధ్రానా అని చూడకుండా ఎక్కడైనా ఆయన సీఎం అయ్యి తీరుతాడని ఆయన స్పష్టం చేశారు.
ఆనాడు 7,8 నెలల్లోనే ఆ పెద్దాయన సీఎం అయ్యాడని సీనియర్ ఎన్టీఆర్‌ను గుర్తు చేశారు టార్జాన్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌కి కూడా అంత చరిష్మా ఉందని, తాను ఇప్పుడే కాదు, ఎప్పటికీ అదే మాట అంటానని ఆయన చెప్పారు. తన ఇంట్లో ఎన్టీఆర్ ఫొటో కింద మై సీఎం అని కూడా రాసి పెట్టుకున్నానని ఆయన తెలిపారు. ఇదంతా తన సొంత అభిప్రాయమే తప్ప, ఇందులో ఎవరి బలవంతమూ, సూచనా లేదని ఆయన చెప్పుకొచ్చారు.
కాబట్టి ఎన్టీఆర్ ఎప్పటికైనా సీఎం అవుతారని, అది గ్యారంటీ అని ఆయన చెప్పారు. అది ఎక్కడ, ఏ రాష్ట్రంలో అనేది మాత్రం తాను చెప్పనన్న ఆయన, అది ఎక్కడైనా అయ్యే అవకాశం ఉందని మాత్రం తెలిపారు. అతనిలో ఆ పవర్ ఉందని ఆయన అన్నారు. ఇకపోతే తాను ఎన్టీఆర్‌తో కలిసి అరవింద సమేత అనే సినిమాలోనే చేశానన్న టార్జాన్, అప్పుడు కూడా ఆయన్ని సీఎం అనే సంబోధించానని చెప్పారు. అదేంటీ అని అడిగితే, అవుతారు అని అన్నట్టు ఆయన అన్నారు. ఎందుకో తెలియదు గానీ, ఆయన్ని చూడగానే సీఎం అవుతారనే అనిపిస్తదని ఆయన చెప్పారు.