Hero Shivaji: అక్కడ ఆయన కనుక గెలిస్తే నేను ఆత్మహత్య చేసుకుంటా… మంత్రి కి సవాల్ విసిరిన హీరో శివాజీ!

Hero Shivaji: ఒకప్పుడు వెండి తెరపై హీరోగా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ విధంగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న శివాజీ రాజకీయాలపై కూడా ఆసక్తితో టిడిపి పార్టీకి మద్దతు పలుకుతూ వైఎస్ఆర్సిపి పార్టీ పై విమర్శలు చేస్తుంటారు.

ఈ క్రమంలోనే ఒకానొక సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నో విమర్శలు చేసిన శివాజీ కొద్దిరోజుల పాటు సైలెంట్ గా ఉన్నప్పటికీ తిరిగి మరోసారి పలు సంచలన వ్యాఖ్యల ద్వారా సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి అలాగే మరో మంత్రికి కూడా శివాజీ చాలెంజ్ విసిరారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలోను ఎంతో వెనుకబడి ఉన్నారు. అధికార పార్టీ తాము ఎంతో అద్భుతంగా పరిపాలన కొనసాగిస్తున్నారనే భావనలో ఉన్నారు కానీ ప్రజలు మాత్రం ఎప్పుడు ఏవియం కనపడుతుందా వీరిని గద్దె దించుదామ అని ఎదురు చూస్తున్నారంటూ శివాజీ తెలియజేశారు. ఇప్పుడే ఎన్నికలకు వెళితే ఒక్కరు కూడా గెలవాలని శివాజీ చాలెంజ్ విసిరారు.

గెలవరనే విషయం వారికి తెలుసు…
ఇప్పుడు ఎన్నికలకు వెళ్లిన వాళ్ళు గెలవరనే విషయం వాళ్ళకి కూడా తెలుసు.ఇక మంత్రి కొడాలి నాని గురించి మాట్లాడుతూ ఆయనలా నేను దిగజారి మాట్లాడలేదని, కొడాలి నాని ఇండిపెండెంట్ అభ్యర్థిగా గుడివాడలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచైనా ఇద్దరం కలిసి పోటీ చేస్తామని అయితే కొడాలి నాని ఏ నియోజకవర్గంలో గెలిచినా తాను ఆత్మహత్య చేసుకుంటానని ఈ సందర్భంగా కొడాలి నానికి కూడా శివాజీ ఛాలెంజ్ విసిరారు.