Allu Arjun : అలాంటి యాడ్ చేయనన్న ఐకాన్ స్టార్…వావ్ అంటున్న నెటిజన్స్…!

Allu Arjun : స్టైలిష్ స్టార్ గా టాలీవుడ్ లో పేరున్న బన్నీ పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకుని ఐకాన్ స్టార్ అయిపోయాడు. బాలీవుడ్ లో బన్నీ క్రేజ్ మాములుగా లేదు డబ్బింగ్ సినిమాల పుణ్యమా అని బన్నీ కి ఫ్యాన్ ఫాలోయింగ్ నార్త్ లో ఫుల్లుగా ఉంది. బన్నీ ఈ మధ్య వరుస హిట్లతో దూసుకుపోతు క్రమంగా తన మార్కెట్ ను బాలీవుడ్ లో పెంచుకుంటున్నాడు. పుష్ప కు సరైన ప్రమోషన్స్ ఇచ్చి అన్ని బాషాలతో పాటు హిందీ లోనూ పాన్ ఇండియా సినిమాగా విడుదల చేసి ఉంటే బన్నీ క్రేజ్ ఇంకోలా ఉండేదని విశ్లేషకుల మాట.

నా పేరు సూర్య సినిమా పరాజయం తర్వాత బన్నీ కొంచెం విరామం తీసుకుని మంచి కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. పుష్ప సక్సెస్ బన్నీ కెరీర్ లో పీక్స్ అనే చెప్పాలి ఇక బాలీవుడ్ లో కూడా బన్నీ కి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయట కానీ బన్నీ మాత్రం అచితూచి అడుగులేస్తున్నాడు. ఇక బన్నీకి ఇటీవల ఒక పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన యాడ్ చేయమనే ఆఫర్ వచ్చిందట. కోట్లు ఆఫర్ చేసిన బన్నీ మాత్రం సింపుల్ గా నో చెప్పేసాడట. జనాలకు హాని కలిగించే ఆల్కహాల్, గుట్కా యాడ్స్ జోలికి పోయి చాలా మంది సెలబ్రిటీలు విమర్శల పాలైన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే బన్నీ కూడా ఎంత డబ్బు ఇచ్చిన అలాంటి యాడ్ చేయనని చెప్పేసాడట. దీంతో నెటిజన్స్ వావ్ బన్నీ నువ్వు సూపర్ అంటున్నారు.ఇక బన్నీ అభిమానులు వారి హీరో చేసిన పనికి ఫుల్ హ్యాపీ అయ్యారు.