“జవాన్” మూవీకి ఐకాన్ స్టార్ రివ్యూ..!

ప్రస్తుతం పాన్ ఇండియా సహా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా భారీ వసూళ్లతో దంచికొడుతున్న చిత్రం “జవాన్”. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా తమిళ యంగ్ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన భారీ సక్సెస్ ఇది కాగా దీనికి మొదట మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ షారుఖ్ ఖాన్ స్టామినా మాత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు తీసుకొస్తుంది.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ఇప్పటికే 600 కోట్లకి పైగా వసూళ్లు అందుకోగా తెలుగు స్టేట్స్ లో కూడా మంచి వసూళ్ళని ఇది రాబట్టింది. దీనితో తెలుగు నుంచి కూడా రాజమౌళి మహేష్ బాబు లాంటి దిగ్గజాలు ఈ సినిమా కోసం మాట్లాడారు కూడా. మరి తాజాగా అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన రివ్యూని ఈ సినిమాపై పంచుకోవడం వైరల్ గా మారింది.

కాగా ఈ సినిమా చూసి మొత్తం సినిమా యూనిట్ నటీనటులు క్రూ అందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను అని. షారుక్ ఖాన్ ని అయితే ఎప్పటి నుంచో ఎలా చూడాలి అనుకుంటున్నామో మొత్తానికి జవాన్ లో అలా చూశానని  ఎప్పటికి ఇలాగే ఉండాలి మీ చార్మ్ తో ఇండియన్ సినిమా ఆడియెన్స్ ని అలరించాలి అని చెప్పాడు.

అలాగే హీరోయిన్స్ నయనతార అలాగే దీపికా పదుకొనె లు నేషనల్ లెవెల్ లో తమ నటనతో ఆకట్టుకుని షైన్ అయ్యారు. ఇక టెర్రిఫిక్ పెర్ఫామర్ విజయ్ సేతుపతి కోసం చెప్పక్కర్లేదు. ఇంకా అనిరుద్ సంగీతానికి పాటలకి మొత్తం ఇండియన్ సినిమానే ఊగిపోయింది అని తెలిపాడు.

ఇక ఫైనల్ గా కెప్టెన్ ఆఫ్ ది షిప్ దర్శకుడు అట్లీకి బిగ్ బిగ్ కంగ్రాట్స్ చెప్తున్నాను అని మంచి కమర్షియల్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేస్తున్నావు సినిమాపై సినిమాకి వర్క్ చేసిన వారిపై ఓ రేంజ్ ప్రశంసలు కురిపిస్తూ తన రివ్యూ వెల్లడించాడు. దీనితో తన పోస్ట్ సోషల్ మీడియాలో యిట్టె వైరల్ అయిపోయింది.