Peddi: రామ్ చరణ్ పెద్ది మూవీ నుంచి శివ రాజ్ కుమార్ ఫస్ట్ లుక్ రిలీజ్.. వైరల్ అవుతున్న పోస్టర్!

Peddi: టాలీవుడ్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రామ్ చరణ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ ఆ తరువాత నటించిన గేమ్ చేంజెర్ సినిమా దారుణమైన ఫలితాలను చెవి చూసింది. కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా విడుదల అయ్యి ఫ్లాప్ అవడంతో అభిమానులు అందరూ కూడా ఇప్పుడు తదుపరి సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు.

రామ్ చరణ్ కూడా తదుపరి సినిమాతో ఎలా అయినా సక్సెస్ ని అందుకోవాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇకపోతే రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ప్ర‌ముఖ క‌న్న‌డ న‌టుడు శివ‌రాజ్‌కుమార్ ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఏఆర్ రెహ‌మాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. వ‌చ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇది ఇలా ఉంటే నేడు హీరో శివరాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా మూవీ మేకర్స్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఆయనకు సంబంధించిన లుక్ ని కూడా విడుదల చేశారు. శివ‌న్న ఎంతో సీరియ‌స్‌గా చూస్తున్న‌ట్లుగా ఈ పోస్ట‌ర్‌ లో క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ వైర‌ల్‌ గా మారింది.