Pawan Kalyan: త్రివిక్రమ్ కోసం ఏమైనా చేస్తా… కానీ అది మాత్రం చేయలేను: పవన్ కళ్యాణ్

Pawan Kalyan: సంతోషంలోనే కాదు, ఆపడలోనే గుర్తొచ్చే ఒక్క మనిషి మనతో ఉన్నారంటే ఆ వ్యక్తి అన్ని విధాలా సంపన్నుడే అనడంలో ఏ మాత్రం అబద్ధం లేదు. అలాంటి వ్యక్తి మన జీవితంలో ఉన్నారు అంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. అలాంటి స్నేహ బంధం ఉన్న మనిషితో కాసేపు అలా మనసు విప్పి మాట్లాడుకుంటే ఉన్న సమస్యలన్నీ పరిష్కారమైనట్టే అనిపిస్తుంది. అర్థం చేసుకోవాలంటే రక్త సంబంధమే కానక్కర్లేదు.. మన మనసుని అర్థం చేసుకొని, మనకు వెన్నంటి ఉండే ఒక్క స్నేహమున్నా చాలు. అలాంటి
స్నేహమే త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ల మధ్య ఉన్నదని ఇప్పటికే వారిద్దరూ చాలా సార్లు నిరూపిస్తూనే ఉన్నారు.

త్రివిక్రమ్ – పవన్ కాంబినేషన్ కు ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే.. ఒక్క అజ్ణాతవాసి మినహా.. వీరి కాంబోలో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలతో పాటు రీసెంట్ గా త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించిన భీమ్లానాయక్ మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. వీరిద్దరి కాంబినేషన్ అనగానే అభిమానుల్లో ఒక రేంజ్ లో అంచనాలు ఉంటాయి. అంతే కాదు వీరి మధ్య ఉన్న బంధం కూడా అంతే పటిష్టంగా ఉంటుందని మనకు తెలిసిందే. ఒకరి ఇష్టానికి మరొకరు రెస్పెక్ట్ ఇస్తూ ఒకరు చెప్తే మరొకరు తప్పకుండా ఏదైనా చేస్తారు అనే స్థాయికి వచ్చారు త్రివిక్రమ్, పవన్ కల్యాణ్.

ఇక వివరాల్లోకి వెళితే, తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు, త్రివిక్రమ్ కు మధ్య చాలా విషయాల్లో అభిప్రాయాలూ ఒకేలా ఉంటాయన్న పవన్, ఒక విషయంలో మాతరం తేడా వస్తుందని చెప్పారు. అదేంటంటే ఒక్క పుస్తకాల విషయంలోనే తామిద్దరి మధ్య తేడాలు వస్తాయని, ఇద్దరం పుస్తకాల పురుగులమే… ఏదైనా పుస్తకం చదవడం మొదలు పెడితే.. అది పూర్తి అయ్యేవరకూ వదిలి పెట్టం అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అందులో భాగంగా ఆయన ఇటీవల జరిగిన ఒక సంఘటనను పంచుకున్నారు. తన దగ్గర ఉన్న పుస్తకాల్లో ఒకటి త్రివిక్రమ్ కు నచ్చి ఇవ్వమని అడిగితే నేను అస్సలు ఇవ్వలేదు. కావాలంటే ఒక సినిమా ఫ్రీగా అయినా చేస్తాను కానీ ఆ పుస్తకం మాత్రం ఇవ్వను” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ఈ విధంగా త్రివిక్రమ్ గురించి సరదాగా అన్న వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.